దిల్లీ చేతిలో గుజరాత్ ఓడిపోయింది. ఐపీఎల్ లవర్స్ ఇది నిజంగా షాకింగ్ విషయం. ఇదే అనుకుంటే ఇప్పుడు హార్దిక్ పాండ్య కామెంట్స్ మరింత వైరల్ గా మారిపోయాయి.
ఏ గేమ్ తీసుకున్నాసరే గెలుపోటములు చాలా సహజం. ఓడిపోయిన తర్వాత చాలామంది దాన్ని తీసుకోలేరు. కొందరు మాత్రం నిర్భయంగా ఒప్పుకుంటారు. నలుగురి ముందు ఏ మాత్రం భయం లేకుండా చెప్తారు. ఇలా చేయాలంటే చాలా గట్స్ కావాలి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య.. దీన్ని చేసి చూపించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఈ జట్టు.. ప్రస్తుత సీజన్ లో పాయింట్ల పట్టిలో చిట్టచివరి స్థానంలో ఉన్న దిల్లీ చేతిలో చాలా సిల్లీగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ రిజల్ట్ పై హార్దిక్ తప్పు ఒప్పుకున్నాడు. నిర్భయంగా దాన్ని బయటపెట్టాడు. అతడి విషయంలో చాలా గిల్టీగా ఫీలవుతున్నామని అన్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గత సీజన్ లో కప్ గెలిచిన గుజరాత్, ఈసారి కూడా అదే ఊపుతో మ్యాచ్ లు ఆడుతోంది. ఇప్పటివరకు 9 మ్యాచ్ లాడితే అందులో కోల్ కతా, రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. సరే ఆ రెండు జట్ల చేతిలో ఓడింది అంటే సరే.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న దిల్లీ క్యాపిటల్స్ చేతిలో మరీ సిల్లీగా ఓటమి పాలైంది. ఎంతలా అంటే.. తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ 130/8 స్కోరు మాత్రమే చేసింది. ఇది చూసిన ఎవరైనా గుజరాత్ ఈజీగా గెలిచేస్తుందని అనుకుంటారు. కానీ అది జరగలేదు.
అద్భుతమైన ప్లేయర్స్ ఉన్న గుజరాత్.. ఓవర్లన్నీ ఆడి 125/6 స్కోరు మాత్రమే చేసింది. దీంతో అస్సలు గెలవదు అనుకున్న దిల్లీ.. 5 రన్స్ తేడాతో అద్భుతం విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో దిల్లీ టాపార్డర్ కుప్పకూల్చిన షమి.. 4 వికెట్లు తీశాడు. దాన్ని ఏ మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయిన గుజరాత్.. అన్ని విభాగాల్లో ఫెయిలైంది. మ్యాచ్ తర్వాత మాట్లాడిన కెప్టెన్ హార్దిక్ పాండ్య తప్పు ఒప్పుకొన్నాడు. ‘షమి విషయంలో బాధపడుతున్నాం. ఎందుకంటే బ్యాటర్లు పూర్తిగా డిసప్పాయింట్ చేశాం. అందులో నేను కూడా ఉన్నాను’ అని హార్దిక్ అన్నాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. మరి దిల్లీ చేతిలో గుజరాత్ ఓడిపోవడం, హార్దిక్ తప్పు ఒప్పుకోవడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Hardik Pandya said “I feel for Shami, batters disappointed him especially me”. pic.twitter.com/wzbguayKhc
— Johns. (@CricCrazyJohns) May 2, 2023