చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోని తనకు ఒక అన్నయ్య, మిత్రుడి లాంటి వాడని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. అతడ్ని దూరం నుంచి గమనిస్తూ తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు.
ఐపీఎల్-2023 చివరి అంకానికి చేరుకుంది. ప్లేఆఫ్స్‌కు సమయం ఆసన్నమైంది. పదహారో సీజన్లో విజేత ఎవరో మరో నాలుగు మ్యాచ్‌లతో తేలిపోనుంది. లీగ్ దశలో టాప్-4లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌పై దృష్టి పెట్టాయి. ఫైనల్స్‌కు చేరుకోవాలంటే క్వాలిఫైయర్స్‌లో గెలవాలి. ఒకవేళ ఓడితే ఎలిమినేటర్ రూపంలో మరో ఛాన్స్ ఉంటుంది. అయితే క్వాలిఫయర్స్‌లో గెలిచి నేరుగా ఫైనల్ వెళ్లాలని అన్ని టీమ్స్ కోరుకుంటున్నాయి. ఫైనల్ బెర్త్ దక్కించుకునే జట్లు ఏవనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఇవాళ చెన్నై, గుజరాత్ మధ్య ఫస్ట్ క్వాలిఫయర్-1 జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే సారథి ఎంఎస్ ధోనీపై గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు.
ధోని సీరియస్‌గా ఉంటాడని చాలా మంది అనుకుంటారని.. కానీ తాను మాహీతో సరదాగా ఉంటానన్నాడు హార్దిక్. జోక్‌లు వేస్తానని, ధోనీలాగా ఎప్పుడూ అతడ్ని చూడనన్నాడు పాండ్యా. అతడు తనకు ఒక అన్నయ్య, మిత్రుడు లాంటి వాడన్నాడు. ధోనీతో కలసి తాను ప్రాంక్స్ చేస్తుంటానని, చిల్ అవుతుంటానన్నాడు హార్దిక్. మాహీ భాయ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాని చెప్పుకొచ్చాడు. క్రికెట్ ప్రేమికులకు ధోని ఎప్పుడూ సూపర్ స్టారేనని వ్యాఖ్యానించాడు. ‘నేను ఎప్పటికీ ధోనీకి అభిమానినే. అతడికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ధోనీని ఎవరైనా ద్వేషించాలంటే, అసహ్యించాలంటే.. వాళ్లు చాలా క్రూరులై ఉండాలి. రాక్షసులు మాత్రమే ధోని లాంటి మనుషుల్ని ద్వేషిస్తారు’ అని పాండ్యా పేర్కొన్నాడు.
Hardik Pandya said, “I’ll always be a MS Dhoni fan. He’s a dear friend and a brother to me. You need to be a devil to hate someone like MS”. pic.twitter.com/oNXjFHIhKT
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 23, 2023