గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తనకంటూ ఓ చరిత్రను లిఖించుకుంది. అడుగుపెట్టిన తొలిసారే కప్ ను ఎగరేసుకుపోయి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా 2023 సీజన్ లో కూడా ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరి ఇంతలా వరుస గెలుపులు సాధించడం వెనక గుజరాత్ సీక్రెట్ ఏంటని అందరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి గుజరాత్ సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తనకంటూ ఓ చరిత్రను లిఖించుకుంది. ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే టైటిల్ కైవసం చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా హార్దిక్ పాండ్యా నేతృత్వంలో.. గతేడాది ఐపీఎల్ బరిలోకి దిగింది గుజరాత్ జట్టు. ఇక ఐపీఎల్ 2023 సీజన్ లో సైతం దుమ్మురేపుతోంది ఈ డిఫెండింగ్ ఛాంపియన్ జట్టు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది. మరి ఇంతలా వరుస గెలుపులు సాధించడం వెనక గుజరాత్ సీక్రెట్ ఏంటని అందరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి గుజరాత్ సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ లో అడుగుపెట్టిన తొలిసారే కప్ ను ఎగరేసుకుపోయి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక అదేజోరును ప్రస్తుత ఐపీఎల్ లో కూడా చూపిస్తోంది. తొలి రెండు మ్యాచ్ ల్లో చెన్నై, ఢిల్లీని ఓడించి తన సత్తా ఏంటో చూపెట్టింది. మరి ఇంతలా గుజరాత్ గెలుపునకు కారణం అవుతున్న ఆ సీక్రెట్ ఏంటా అని అందరు వెతుకుతున్నారు. అయితే ఆ సక్సెస్ కు ఏకైక కారణం గుజరాత్ జట్టులో ఎక్కువగా ఆల్ రౌండర్లు, మ్యాచ్ విన్నర్లు ఉండటం. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇదే నిజం. ఇందుకు సంబంధించిన గణాంకాలు సైతం ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి.ఇక వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్ లో ప్రతి జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్ లు ఆడుతుంది. ఇక గతేడాది జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల్లో 11 సార్లు గుజరాత్ ఆటగాళ్లే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లుగా ఎంపిక కావడం విశేషం.
అదీకాక గుజరాత్ జట్టులో ఎక్కువగా ఆల్ రౌండర్లు ఉన్నారు. ఇదే వారి విన్నింగ్స్ సీక్సెట్. పైగా అందరు మ్యాచ్ విన్నర్లు కూడా.. పాండ్యా, మిల్లర్, రషీద్ ఖాన్, తెవాతియా, గిల్, షమీ, విజయ్ శంకర్ లతో టీమ్ పటిష్టంగా ఉంది. ఇలా ఎక్కువ ఆల్ రౌండర్స్ ఉన్న జట్లు ఐపీఎల్ లో చాలా తక్కువే ఉన్నాయి. ఉన్నా గానీ గుజరాత్ లా ఆడే ఆటగాళ్లు తక్కువే అని చెప్పాలి. పరిస్థితులకు తగ్గట్లుగా గేమ్ ఆడటంలో గుజరాత్ ప్లేయర్స్ దిట్ట అనే చెప్పాలి. గతంలో ఆస్ట్రేలియా జట్టు కూడా ఇలా ఆల్ రౌండర్స్ తోనే ప్రపంచ లో అగ్రస్థానంలో కొనసాగింది. ఒకప్పటి ఆస్ట్రేలియా జట్టును తలపిస్తోంది గుజరాత్ జట్టు. 2022 ఐపీఎల్ సీజన్ నుంచి ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు 13 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు గెలుచుకోవడం విశేషం.
ఈ గణాంకాలు చూస్తేనే అర్ధం అవుతుంది గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ విభాగంలో.. మ్యాచ్ విన్నర్ల విభాగంలో ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఐపీఎల్ లో ఇతర జట్లలో ఇలా సమష్టిగా రాణించే ఆటగాళ్లు తక్కువగా ఉన్నారు. బౌలింగ్ విభాగంలో సైతం గుజరాత్ పటిష్టంగా ఉంది. జోషువా లిటిల్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, పాండ్యా, రషీద్ ఖాన్ లతో శత్రుదుర్బేద్యంగా ఉంది. ఒక జట్టు విజయం సాధించాలి అంటే కేవలం బ్యాటింగ్ ఉంటే సరిపోదు. బౌలింగ్, బ్యాటింగ్ లతో ఆల్ రౌండ్ ఫర్మామెన్స్ చేస్తేనే ప్రత్యర్థిలను మట్టికరిపించవచ్చు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ సక్సెస్ సీక్రెట్ ఇదే అంటూ క్రీడా పండితులు పేర్కొంటున్నారు. మరి గుజరాత్ విజయాలకు కారణం ఆ జట్టు ఆల్ రౌండర్లే అన్న కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.
Gujarat Titans are packed with match winners ☄️💪#IPL #CricketTwitter #IPL #DCvsGT pic.twitter.com/lrvTCeQuHj
— Sportskeeda (@Sportskeeda) April 5, 2023