ముంబయిపై గెలిచిన గుజరాత్ ఫైనల్లో అడుగుపెట్టేసింది. కానీ గిల్ సెంచరీలు, ఆరెంజ్ క్యాప్ వల్ల ఆ జట్టుతోపాటు ఫ్యాన్స్ కి కొత్త భయం పట్టుకుంది. ఒకవేళ ఈ భయం నిజమైతే మాత్రం కప్ కొట్టడం కష్టమే!?
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్.. మరోసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. తాజాగా జరిగిన క్వాలిఫయర్-2లో ముంబయిపై 62 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. గుజరాత్ ఓపెనర్ శుభ్ మన్ గిల్.. ఈ గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. కేక పుట్టించే బ్యాటింగ్ తో సెంచరీ చేసి శెభాష్ అనిపించాడు. ఇప్పుడు ఏ గిల్ అయితే గుజరాత్ జట్టు ఫైనల్ కి వచ్చేలా చేశాడో.. ఇప్పుడు అతడి వల్లే సొంతజట్టుకి కొత్త టెన్షన్ పట్టుకుంది. అలా అస్సలు జరగకూడదని గుజరాత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియాలో విరాట్ కోహ్లీ తర్వాత ఎవరు అనేదానికి ఆన్సర్ దొరికేసింది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న గిల్.. నాలుగు ఇన్నింగ్స్ ల్లో మూడు సెంచరీలు చేసిన సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా ముంబయిపైనే ఇలానే సెంచరీ చేసి గుజరాత్ జట్టు వరసగా రెండోసారి ఫైనల్ కి చేరడంలో కీలకపాత్ర పోషించాడు. డుప్లెసిస్(730)ని దాటేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 851 పరుగులతో గిల్ ఉన్నాడు. అతడి దరిదాపుల్లో ఎవరూ లేరు. అయితే ఇప్పుడు ఈ ఆరెంజ్ క్యాప్ సెంటిమెంట్.. గుజరాత్ ఫ్యాన్స్ ని భయపెడుతోంది.
ఎందుకంటే ఇప్పటివరకు ఐపీఎల్ లో 15 సీజన్లు జరిగాయి. అందులో కేవలం రెండుసార్లు మాత్రమే ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ప్లేయర్ ఉన్న జట్టు కప్ కొట్టింది. 2014లో కోల్ కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవగా, ఆ జట్టుకి ఆడిన ఉతప్ప ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 2021లో చెన్నై కప్ కొట్టింది. రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ సెంటిమెంట్ బ్రేక్ అయితే పర్లేదు. లేదంటే మాత్రం గుజరాత్ కి కప్ కష్టమేనని అంటున్నారు. మరి ఆదివారం జరగబోయే ఫైనల్ లో గిల్ ఎన్ని పరుగులు చేస్తాడు? కప్ కొట్టేది గుజరాత్ లేదా చెన్నై? ఎవరనేది తెలిసిపోతుంది. మరి ఆరెంజ్ టోపీ-నో ట్రోఫీ సెంటిమెంట్ పై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Congratulations to the Gujarat Titans, who march to the #Final of the #TATAIPL for the second-consecutive time 🙌
They complete a formidable 62-run win over Mumbai Indians 👏🏻👏🏻#TATAIPL | #Qualifier2 | #GTvMI | @gujarat_titans pic.twitter.com/rmfWU7LJHy
— IndianPremierLeague (@IPL) May 26, 2023