స్పిన్నర్ రషీద్ ఖాన్ చెన్నై సూపర్ కింగ్స్ కొంపముంచాడు. బౌలింగ్ తో బ్యాటర్లని కట్టడి చేసిన ఇతడు.. చివర్లో బ్యాటుతోనూ అదరగొట్టి చెన్నై ఓటమికి కారణయ్యాడు. దీంతో గుజరాత్ తొలి విజయం నమోదు చేసింది.
ఐపీఎల్ కొత్త సీజన్ గ్రాండ్ గా ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. ఆతిథ్య గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన గుజరాత్.. చివరివరకు తీసుకొచ్చి చెన్నై జట్టుని ఓడించింది. ఆతిథ్య జట్టులో ప్రధాన బ్యాటర్లు లేకపోవడం, విఫలమైనప్పటికీ.. మిడిలార్డర్ తోపాటు ఆల్ రౌండర్లు ఆదుకోవడం ఫస్ట్ మ్యాచ్ లోనే గుజరాత్ విజయం సాధించింది. ఇంతకీ తొలిరోజు పోరులో ఏం జరిగింది? ఏంటనేది ఇప్పుడు చూద్దాం!
ఇక వివరాల్లోకి వెళ్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నైకి ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. 50 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఈ ఊపు చూస్తే.. csk చాలా ఈజీగా 200 స్కోరు దాటేస్తుందని అనుకున్నారు. కానీ రుతురాజ్ సరైన సహకారం ఇచ్చే బ్యాటర్లు లేకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివర్లో ధోనీ వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయింది. రుతురాజ్ తర్వాత మొయిన్ అలీ మాత్రమే 23 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు అందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.
అనంతరం ఛేదనలో గుజరాత్ చాలా నెమ్మదిగా ఆడుతూ వెళ్లింది. ఫీల్డింగ్ చేస్తూ విలియమ్సన్ గాయపడటంతో ఆ ప్రభావం బ్యాటింగ్ పై పడుతుందని అనుకున్నారు. కానీ అలాంటిదేం లేకుండానే గుజరాత్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ గిల్ చాలా కూల్ గా రన్స్ కొడుతూ వెళ్లాడు. 36 బంతుల్లో 63 పరుగులు చేసి ఔటైపోయాడు. మిగతా బ్యాటర్లలో సాహా 25, సుదర్శన్ 22, విజయ్ శంకర్ 27 తలో చేయి వేయడంతో టార్గెట్ దగ్గర వరకు వెళ్లిపోయారు. గుజరాత్ 9 బంతుల్లో 18 రన్స్ కొట్టాల్సిన టైంలో చెన్నై గెలుస్తుందేమోనని అనుకున్నారు.
కానీ తెవాటియా (15 నాటౌట్), రషీద్ ఖాన్ (10 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. బౌలింగ్ తో ఆకట్టుకున్న రషీద్.. బ్యాటింగ్ లోనూ 4, 6 కొట్టి చెన్నై కొంపముంచాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ విజయంతో కొత్త సీజన్ ప్రారంభించింది. అలానే చెన్నైపై వరసగా 3 మ్యాచులు గెలిచి.. ఓ ఘనత సాధించింది. చెన్నైపై ఇప్పటివరకు ముంబయి అత్యధికంగా 5 సార్లు గెలిచింది. గుజరాత్ ఇప్పుడు ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఈ క్రమంలోనే చెన్నై ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నప్పటికీ.. తర్వాతి మ్యాచుల్లో జట్టు విజయాలు సాధిస్తుందిలే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఫస్ట్ మ్యాచ్ లోనే చెన్నై ఓడిపోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
A perfect start to our #TATAIPL 2023 campaign 💪#TitansFAM, describe that opening victory in ☝️ word! #AavaDe | #GTvCSK pic.twitter.com/6vFc7LaXzn
— Gujarat Titans (@gujarat_titans) March 31, 2023