భారత పేసర్ మహమ్మద్ షమీ నిప్పులు చెరిగాడు. పదునైన బంతులతో ఢిల్లీ బ్యార్లట్లకు చెమటలు పట్టించాడు. అతని ధాటికి సగం మంది ఢిల్లీ బ్యాటర్లు.. పవర్ ప్లే ముగిసేలోపే పెవిలియన్ చేరిపోయారు. దీంతో బ్యాటర్ల మెరుపులు లేకపోవడంతో ప్రేక్షకులు స్టేడియంలో దిగాలుగా కూర్చున్నారు.
టీమిండియా ప్రధాన పేసర్, గుజరాత్ బౌలర్ మహమ్మద్ షమీ నిప్పులు చెరిగాడు. పదునైన బంతులతో ఢిల్లీ బ్యార్లట్లకు చెమటలు పట్టించాడు. అతని ధాటికి సగం మంది ఢిల్లీ బ్యాటర్లు.. ఐదు ఓవర్లు ముగిసేలోపే పెవిలియన్ చేరిపోయారు. తొలి ఐదు ఓవర్లలో.. మూడు ఓవర్లు వేసిన షమీ నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. షమీ ధాటికి ఫిలిప్ సాల్ట్ (0), ప్రియమ్ గార్గ్(10), రిలీ రోసో(8), మనీష్ పాండే(1).. ఇలా ఒకరివెంట మరొకరు పెవిలియన్ బాట పట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(0) ఔటయ్యాడు. షమీ వేసిన తొలి బంతిని షాట్ ఆడిన అతను మిల్లర్ క్యాచ్ పట్టడంతో డకౌటయ్యాడు. దీంతో ఢిల్లీ ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. అనంతరం కాసేపటికే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(2) రనౌటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో రషీద్ ఖాన్ విసిరిన మెరుపు త్రో అతనిని పెవిలియన్ బాట పట్టించింది. ఆపై క్రీజులోకి వచ్చిన రిలే రస్సో(8) రెండు ఫోర్లతో కుదురుకున్నాడనిపించినా షమీ మంచి బంతితో బోల్తా కొట్టించాడు. ఇక ఒకప్పటి హీరో మనీశ్ పాండే(1) ఎప్పటిలానే త్వరగానే ఔటయ్యాడు. సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి ప్రియమ్ గార్గ్(10) కూడా ఔట్ అవ్వడంతో.. ఢిల్లీ ఐదు ముగిసేలోపే 5 కీలక వికెట్లు కోల్పయింది.
Saha is probably one of the best wicketkeeper in India.#Cricket #CricketNews #CricketTwitter #MohammedShami #GTvsDC #DCvsGT #IPL #IPl2023 #WridhimannSaha pic.twitter.com/TfjCi1UH9a
— CricInformer (@CricInformer) May 2, 2023
Mohammed Shami was unstoppable with the new ball ⚡️#GTvDC | #IPL2023 pic.twitter.com/FuWrxFAg3o
— ESPNcricinfo (@ESPNcricinfo) May 2, 2023
ఇక ఇప్పటివరకు జరిగిన మ్యాచులలో రెండు జట్లు 8 మ్యాచులు ఆడగా.. గుజరాత్ ఆరింట గెలిచి రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. మరో మరోవైపు.. ఢిల్లీ రెండింట గెలిచి ఆరు మ్యాచుల్లో ఓడింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఈ ఏడాది బరిలోకి దిగిన సేనకు ప్రత్యర్థి జట్లు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఒకరి విఫలమైన మరొకరు జట్టును విజయతీరాలకు చేరుస్తున్నారు. దీంతో మరోసారి టైటిల్ వేటలో అందరికంటే ముందుంది. షమీ స్పెల్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mohammed Shami in IPL 2023:
4-0-29-2
4-0-41-3
4-0-28-1
4-0-44-1
4-1-25-3
3-1-18-0
4-0-18-0
4-0-33-3
4-0-11-4The Purple Cap holder of this IPL – Phenomenal, Shami. pic.twitter.com/Bi8sGbqRFC
— CricketMAN2 (@ImTanujSingh) May 2, 2023