అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ 2023 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచులో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
ఐపీఎల్ 2023 తొలి మ్యాచులోనే గాయాల బెడద మొదలైంది. అరంగ్రేట మ్యాచులోనే సన్ రైజర్స్ మాజీ సారథి, ప్రస్తుత గుజరాత్ టైటాన్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్ తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీ ఆపబోయే ప్రయత్నం చేసిన విలియమ్సన్.. అదుపుతప్పి బలంగా భూమిని తాకాడు. ఈ క్రమంలో అతని మోకాలికి తీవ్ర గాయమైంది. నొప్పితో కేన్ మామ విలవిలలాడిపోయాడు. వెంటనే సహచర ఆటగాళ్లు, సిబ్బంది అక్కడికి చేరుకొని అతనిని పైకిలేపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి అతడు మైదానం వీడినప్పటికీ.. రాబోవు మ్యాచుల్లో బరిలోకి దిగేది అనుమానంగా మారింది.
కాగా, ఐపీఎల్ 2023 ఆరంభ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ వీరవిహారం చేస్తోంది. 12 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. సీనియర్ ఆటగాళ్ళైన డెవాన్ కాన్వే(1), మోయిన్అలీ(23), బెన్ స్టాక్స్(7) నిరాశపరిచినా.. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ చెలరేగి ఆడుతున్నాడు. 34 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ 3 ఫోర్లు, 8 సిక్సులు సాయంతో 70 పరుగుల చేసి నాటౌట్ గా ఉన్నాడు. కాగా, మహ్మద్ షమీ వేసిన మొదటి ఓవర్‌ని ఫేస్ చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి పరుగు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 2023 సీజన్‌లో తొలి ఫోర్, తొలి సిక్స్ కొట్టిన ఆటగాడు కూడా రుతురాజే కావడం గమనార్హం.
Kane Williamson injured his knee while saving a boundary.
He saved two runs for his team 👏. We hope it is not a serious injury🤕
📸: Jio Cinema pic.twitter.com/P6GE6NCPGz
— CricTracker (@Cricketracker) March 31, 2023
Kane Williamson Injured. #IPL2023 #IPLonJioCinema #cskvsgt #GTvCSK pic.twitter.com/fwORzLNTPw
— Karthick Santhaanam (@karthickdhoni98) March 31, 2023
#KaneWilliamson is injury 😥 hope nothing a serious 🖤 #GTvCSK pic.twitter.com/sCCFwaO80h
— Hamza Hamzi (@HamziSr4) March 31, 2023