మార్చి 31 నుంచి టాటా ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి ఏ జట్టు కప్పు కొడుతుంది అనే ప్రశ్న ఇప్పటి నుంచే వినిపిస్తోంది. అయితే ఈసారైనా ఆర్సీబీ కప్పు కొట్టి అభిమానులను ఆనందపరుస్తుందా అనేది చూడాలి. వరుస బ్యాడ్ న్యూస్ ల తర్వాత ఆర్సీబీకి ఒక శుభవార్త అందింది.
15 ఐపీఎల్ సీజన్లు ముగిసినా ఒక్క టైటిల్ కూడా గెలలేదు.. క్రేజ్ చూస్తే ఆకాశాన్ని దాటింది. బాగా ఆడలేక విమర్శలు మూట గట్టుకున్నా.. ఐపీల్లోనే మోస్ట్ పాపులర్ టీంలో ఒకటిగా కొనసాగుతుంది. స్టార్ ప్లేయర్లతో కళకళలాడుతున్నా.. ఇంకా ఫ్యాన్స్ ని నిరాశా పరుస్తూనే ఉంది. ఇది ఐపీఎల్లో ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీం పరిస్థితి. ప్రతీ సీజన్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగినా.. టోర్నీ గెలవడంలో మాత్రం విఫలమవుతోంది. అయితే.. ఈ సారి విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చిన ఆనందం కంటే.. కొంతమంది ప్లేయర్లు దూరం అవ్వడమే ఆర్సీబీని ఎక్కువగా బాధిస్తోంది.
ఇప్పటికే భారీ ధరకు కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్ విల్ జాక్స్ గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ కే దూరం అయ్యాడు. మణికట్టు గాయం కారణంగా ఆస్ట్రేలియన్ పేసర్ హేజల్ ఉడ్ ఆడతాడో లేదో సందిగ్ధత నెలకొంది. తాజాగా ఈ లిస్టులోకి రజత్ పటిదార్ కూడా చేరిపోయాడు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అవుతుండగా పటిదార్ గాయం బెంగళూర్ టీమ్ షాక్ కి గురిచేసింది. దీని ప్రకారం పటిదార్ టోర్నీ ఫస్ట్ హాఫ్ మొత్తానికి దూరం కానున్నాడు. ఇవన్నీ ఇలా ఉంటే.. ఇప్పుడు ఆ జట్టుకి ఒక విషయం ఊరట కలిగిస్తోంది. స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఈ ఐపీఎల్లో బరిలోకి దిగడం ఖరారు అయిపోయింది.
గ్లెన్ మ్యాక్స్ వెల్ టీ20 క్రికెట్లో ఎంత ప్రమాదకరమైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బౌలర్ ఎవరైనా, పిచ్ ఏదైనా విధ్వంసం సృష్టించగలడు. ఇన్నోవేటివ్ షాట్లు ఆడుతూ.. గ్రౌండ్ నలువైపులా బౌండరీల వర్షం కురిపించగల సత్తా మ్యాక్సీ సొంతం. అయితే సరిగ్గా రెండు రోజుల క్రితం ఈ ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ ఆల్ రౌండర్.. “గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. పూర్తి ఫిట్ నెస్ సాధించడానికి కనీసం రెండు నెలలైనా పడుతుంది” అని చెప్పగానే ఆర్సీబి ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది. కానీ అలాంటి భయాలు ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్స్ వెల్ ఫిట్ గా ఉన్నాడా? లేడా అనే సంగతి పక్కన పెడితే ఈ ఐపీఎల్ 2023లో మ్యాక్ వెల్ ఆడటం కంఫర్మ్ అయిపోయింది.
Maxi loves his fans! 😁
We didn’t just see him strike some sixes in the crowd yesterday, but we also witnessed a heartwarming gesture from the entertainer!🧤❤️#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 @Gmaxi_32 pic.twitter.com/cqM1aaRUC4
— Royal Challengers Bangalore (@RCBTweets) March 27, 2023
ముందు నుంచి మ్యాక్స్ వెల్ గాయం విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. తాజాగా వాటన్నిటికీ చెక్ పెడుతూ.. ఈ స్టార్ ఆల్ రౌండర్ ఆడటం పక్కా అని ఆర్సీబి యాజమాన్యం అధికారకంగా ప్రకటించేసింది. దీంతో అభిమానులు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 31 న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తో ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే ఆర్సీబీ తొలి మ్యాచ్ మాత్రం ఏప్రిల్ 2వ తారీఖున రాత్రి 8 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో తలపడాల్సి ఉండగా.. ఈ సీజన్లో ఏ మేరకు బెంగళూర్ జట్టు రానిస్తుందో చూడాలి. మొత్తానికి ఆర్సీబీ స్టార్ ప్లేయర్ మ్యాక్స్ వెల్ ఐపీఎల్ మ్యాచులకు అందుబాటులోకి వస్తున్నాడు అనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Raw emotions are a double-edged sword! 🎭
Maxi talks about how the desire to win can drive your team but, if not contained well, can be destructive on @eatsurenow presents #RCBPodcast!
Listen to the audio versions of all ten episodes on Spotify & Apple Podcasts. 🎧#PlayBold pic.twitter.com/9DPWxYoRjy
— Royal Challengers Bangalore (@RCBTweets) March 27, 2023