ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ హవా నడుస్తుంది. ఇక ఈ టోర్నీ తర్వాత భారత్ ముందు బిజీ షెడ్యూలే ఉందని చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా.. గవాస్కర్ వరల్డ్ కప్ గురించి ఇప్పుడే మాట్లాడుతున్నాడు.
టీంఇండియాలో ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్ చివరి దశలో ఉందనే చెప్పుకోవాలి. దీనికి కారణాలు లేకపోలేదు. గత రెండేళ్లలో వీరు కెరీర్ చాలా అద్వా స్థితిలో నడుస్తుంది. అయితే మాజీ సారధి విరాట్ కోహ్లీ మాత్రం అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. గతేడాది వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ మీద సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ.. ఆ తర్వాత ఫార్మాట్ ఏదైనా చెలరేగిపోతున్నారు. వన్డే, టెస్టుల్లో సెంచరీలు.. ఇక తాజాగా ఐపీఎల్ లో బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలతో దుమ్ములేపాడు. ఈ నేపథ్యంలో విరాట్ కెరీర్ మీద మరో రెండేళ్లు ఎవరూ కూడా వేలెత్తి చూపే అవకాశం కనిపించడం లేదు. ఇక ఎటు చూసిన ఈ విషయంలో రోహిత్ కెరీర్ డేంజర్ జోన్ లో ఉందని తెలుస్తుంది. తాజాగా.. సునీల్ గవాస్కర్ కూడా కోహ్లీని పొగుడుతూనే రోహిత్ ని పట్టించుకోవడం మానేసాడు.
ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ హవా నడుస్తుంది. ఇక ఈ టోర్నీ తర్వాత భారత్ ముందు బిజీ షెడ్యూలే ఉందని చెప్పుకోవాలి. ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఆఫ్ఘానిస్తాన్.. వెస్టిండీస్ తో వన్డే సిరీస్, ఆసియా కప్, స్వదేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ ఇలా తీరికలేని షెడ్యూల్ తో ఈ సంవత్సరం బిజీ కానుంది టీమిండియా. ఇక వీటి 2024 లో వరల్డ్ కప్ కోసం ఇప్పుడే మాట్లాడుతున్నాడు లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్. ఈ సందర్భంగా రోహిత్ ఉన్నా.. లేకున్నా కోహ్లీ మాత్రం 2024 వరల్డ్ కప్ కోసం ఖచ్చితంగా ఉండాలని చెప్పుకొచ్చాడు.
“2024లో టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో మరోసారి ఐపీఎల్ జరుగుతుంది. అప్పుడు కూడా విరాట్ కోహ్లీ ఇదే ఫామ్ కొనసాగిస్తే, అతనికి టీ20 వరల్డ్ కప్లో చోటు ఉండి తీరాల్సిందే…ఇప్పటి నుంచే విరాట్ కోహ్లీని టీ20ల్లో ఆడించాలని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఉంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంది. టెస్టు సిరీస్లు ఆడబోతున్నారు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ చాలా అవసరం..రోహిత్ శర్మ పేలవ ఫామ్లో ఉన్నాడు, టీ20ల్లో మునుపటిలా ఆడలేకపోతున్నాడు. కెఎల్ రాహుల్ గాయం కారణంగా సీజన్ మొత్తం ఆడలేదు. ఆడిన మ్యాచుల్లో అతని మార్కు కనిపించలేదు. కాబట్టి రోహిత్, రాహుల్ ఉన్నా లేకున్నా విరాట్ కోహ్లీని టీ20లు ఆడించాలి”. అని గవాస్కర్ తెలియజేశాడు. మరి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.