ఆటల్లో వివాదాలు జరుగుతుండటం కామనే. కానీ గేమ్ కంటే కాంట్రవర్సీలు హైలైట్ అవడం ఎంతమాత్రం మంచిది కాదు. వివాదాలకు ఎండ్ కార్డ్ పడి.. ఆటపై ఫోకస్ పెంచాలి. కానీ ఈ వివాదాలను ఆటగాళ్లు లైట్ తీసుకున్నా.. వారి ఫ్యాన్స్ మాత్రం అస్సలు వదలమని అంటున్నారు.
ఐపీఎల్ పదహారో సీజన్‌ను వివాదాలు వీడటం లేదు. ఆట కంటే కాంట్రవర్సీలు ఈసారి లీగ్‌లో ఎక్కువైపోయాయి. ఈ వివాదాలకు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కేంద్ర బిందువుగా మారడం గమనార్హం. తొలుత సౌరవ్ గంగూలీతో వివాదాస్పదంగా ప్రవర్తించిన విరాట్.. ఆ తర్వాత గౌతం గంభీర్‌తో కయ్యానికి కాలు దువ్వాడు. గంభీర్ కూడా కోహ్లీతో బాహాబాహీకి దిగడం వివాదాస్పదంగా మారింది. క్రికెట్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కానీ కోహ్లీ ఫ్యాన్స్ దీనికి ఇప్పట్లో చెక్ పెట్టేలా కనిపించడం లేదు. లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరిగిన ప్రతి చోట గంభీర్‌ను టార్గెట్ చేస్తున్నారు విరాట్ అభిమానులు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో ఆడుతున్న మ్యాచ్‌లోనూ అదే రిపీట్ అయింది.
సన్‌రైజర్స్-లక్నోకు మధ్య హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. అయితే మ్యాచ్ సందర్భంగా కొందరు కోహ్లీ అభిమానులు గంభీర్‌ను టార్గెట్ చేసుకుని లక్నో డగౌట్‌పై నీళ్ల సీసాలు విసిరారు. అంతేకాదు నట్స్, బోల్ట్స్‌ను కూడా లక్నో ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ కూర్చున్న చోటకు విసిరారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరికొన్ని వీడియోల్లో గంభీర్ గ్రౌండ్లోకి వస్తుండగా సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కోహ్లీ.. కోహ్లీ అంటూ అరుస్తూ కనిపించారు. మ్యాచ్ ఎస్ఆర్హెచ్, లక్నో మధ్య జరిగితే ఇలా కోహ్లీ.. కోహ్లీ అంటూ అరవడం, గంభీర్‌ను టార్గెట్‌గా చేసుకుని వాటర్ బాటిల్స్, నట్స్, బోల్ట్స్ విసరడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగింది సన్‌రైజర్స్. నిర్ణీత 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 6 వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), హెన్రిచ్ క్లాసెన్ (47), అబ్దుల్ సమద్ (37) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లక్నో ప్రస్తుతానికి 10.2 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 69 రన్స్ చేసింది.
‘Kohli Kohli’ chants the Hyderabad crowd in front of the Lucknow Supergiants’ dugout.pic.twitter.com/rRS6XGyTVe
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 13, 2023
After the controversial no-ball decision, the Hyderabad crowd threw nuts and bolts at the Lucknow Super Giants dugout and the match was stopped for a few minutes.
📸: Jio Cinema pic.twitter.com/oIyTSnB735
— CricTracker (@Cricketracker) May 13, 2023