మైదానంలో గౌతమ్ గంభీర్ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో అందరీ తెలుసు. అలాగే విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో కూడా తెలుసు. అలాంటి ఈ ఇద్దరి మధ్య ఏదైనా చిచ్చు రాజేసుకుంటే ఎలా ఉంటుంది? దాదాపు ఒక యుద్ధ వాతావరణమే నెలకొంటుంది. అలాంటి ఘటనే తాజాగా లక్నో- ఆర్సీబీ మ్యాచ్ లో జరిగింది. అయితే ఇప్పుడు ఈ గొడవ బీజేపీకి తలనొప్పిగా మారుతోంది.
ఐపీఎల్ 2023 సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లు ఒకెత్తు.. సోమవారం రాత్రి లక్నో- బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ఒకెత్తు. మైదానంలో అసలు అందరూ కొట్టుకుంటారేమో అనేంతలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ- నవీన్ ఉల్ హక్ మధ్య గొడవ జరిగింది. కోహ్లీ- నవీన్ మధ్యకి మిశ్రా, అంపైర్లు జోక్యం చేసుకుని వారిని విడదీశారు. అయితే ఆ గొడవ తర్వాత షేక్ హ్యాండ్స్ సమయంలో కూడా నవీన్ ఉల్ హక్ దురుసుగా ప్రవర్తించాడు. ఆ తర్వాతే అసలు గొడవ మొదలైంది. విరాట్ కోహ్లీ- నవీన్ ఉల్ హక్ మధ్య వివాదం కాస్తా.. విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ గొడవలా మారిపోయింది. అయితే వీళ్ల గొడవ ఇప్పుడు బీజేపీకి తలనొప్పిగా మారింది.
విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ మధ్య గొడవ ఈ మ్యాచ్ లోది కాదులెండి. చివరిసారి ఏప్రిల్ 10న చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ- లక్నో తలపడిన సమయంలో మొదలైంది. గంభీర్ మైదానంలో ఆర్సీబీ ఫ్యాన్స్ కు నోరు మూసుకోండి అని వేలు చూపించడం నుంచే షురూ అయింది. అలాగే ఆ మ్యాచ్ లో అవేశ్ ఖాన్, భిష్ణోయ్ కూడా కాస్త ఆవేశంగానే ప్రవర్తించాడు. అయితే తాజా మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వీళ్లందరి ప్రవర్తనకు సమాధానం చెప్పాడు. అదే విషయాన్ని గంభీర్ కూడా జీర్ణించుకోలేకపోయాడు. కారణం ఏదైనా గానీ.. మరోసారి గంభీర్- విరాట్ కోహ్లీ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడు ఈ గొడవ క్రికెట్ నుంచి రాజకీయాలకు పాకింది. వీళ్ల గొడవ ఇప్పడు బీజేపీకి పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది.
Virat Kohli always gives it back 😅
📸: IPL/BCCI#IPL2023 | #LSGvRCB pic.twitter.com/42tVV46qBn
— CricTracker (@Cricketracker) May 1, 2023
గౌతమ్ గంభీర్ బీజేపీ ఎంపీ అని అందరికీ తెలిసిందే. గంభీర్- విరాట్ కోహ్లీ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మీకు విషయం అర్థమైపోయుండాలి. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి. మే 10న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. గంభీర్ పోయి పోయి బెంగళూరు జట్టుతో సీరియస్ గా ఉండటం, చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ కి వేలు చూపించడం అన్నీ బీజేపీకి తలనొప్పిగా మారాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ మొత్తం బీజేపీపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో క్రికెట్ లో ఇలాంటి గొడవలు జరగడం బీజేపీకి ఎలాంటి నష్టం చేకూరుస్తుందో చెప్పలేని పరిస్థితి. కోహ్లీ- గంభీర్ గొడవ బీజేపీని ఇబ్బంది పెడుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A BJP MP threatening Kannadigas pride RCB’s Virat Kohli. The People of Karnataka are ready to teach them a lesson on 13th May.pic.twitter.com/RqMpNijZGj
— Shantanu (@shaandelhite) May 1, 2023