Gautam Gambhir, Virat Kohli: కోహ్లీ-గంభీర్ వివాదంలో మరో సంచలన వ్యాఖ్య వెలువడింది. కోహ్లీని చూసి గంభీర్ ఓర్వలేకపోతున్నాడని, అతనికి కోహ్లీ అంటే కుళ్లు అంటూ ఓ ప్రముఖ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఇద్దరూ గొప్ప ఆటగాళ్లే. భారత క్రికెట్‌కు ఎంతో చేశారు. పైగా ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు. అయినా ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. 2013 ఐపీఎల్ సీజన్ సందర్భంగా వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత నుంచి వీరిద్దరి మధ్య పెద్దగా మాటలు లేవు. మ్యాచ్‌ల సందర్భంలో ఎప్పుడు కలిసినా.. ఎదో నామ్‌కే వాస్త పలకరించుకుంటారు తప్ప.. పెద్దగా మాట్లాడుకోరు. అయితే.. తాజాగా ఆర్సీబీ-లక్నో మ్యాచ్‌లో మరోసారి వీరిద్దరి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ముందు కోహ్లీకి నవీన్ ఉల్ హక్ మధ్య మాట మాట జరిగింది.
మ్యాచ్ తర్వాత ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునేటప్పుడు కోహ్లీ-నవీన్ మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కోహ్లీ-కైల్ మేయర్స్ మాట్లాడుకుంటున్న సమయంలో గంభీర్ వచ్చి మేయర్స్‌ను లాక్కెళ్లిన తర్వాత.. కోహ్లీకి గంభీర్‌కి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. మధ్యలో కేఎల్ రాహుల్, అమిత్ మిశ్రా లాంటి ఆటగాళ్లు వచ్చి విడిపించడంతో గొడవ సద్దుమణిగింది. అయితే.. ఈ వివాదంలో గంభీర్‌కు సంబంధం లేకపోయినా.. గంభీర్ అనవసరంగా కలగజేసుకున్నాడంటూ అతనిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి.
అయితే.. గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాడని, తనకంటే కోహ్లీ అత్యుత్తమ ఆటగాడనే విషయాన్ని గంభీర్ జీర్ణించుకోలేకపోతున్నాడంటూ.. ఎన్డీటీవీ చీఫ్ ఎడిటర్ రజత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై గంభీర్ అభిమానులు రజత్ శర్మపై మండిపడుతుండగా.. కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం రజత్ శర్మకు మద్దుతగా నిలిస్తున్నారు. మరి రజత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rajat Sharma 🗣️”Gautam Gambhir is jelous of Virat Kohli’s achievements. He’s not able to digest the fact that Kohli is far better than him.”
Rajat ji owned Gambhir 😂🔥
Burnol moment for haters 🤡🤣#ViratKohli𓃵 #ViratGambhirFight #gautamgambhir #RajatSharma pic.twitter.com/wjnAibtRDB
— Atom (@one8_07) May 3, 2023