ఆటల్లో అగ్రెషన్ కామన్. క్రికెట్లో కూడా ఎంతో మంది ప్లేయర్లు అగ్రెషన్‌ను చూపిస్తుంటారు. అయితే టీమిండియా మాత్రం ఇందుకు కాస్త విభిన్నం. సచిన్, కుంబ్లే, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి ఎందరో ప్లేయర్లు గ్రౌండ్లో ఎంతో హుందాగా నడుచుకున్నారు. అదే టైమ్‌లో సౌరవ్ గంగూలీ, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ లాంటి వాళ్లు అగ్రెషన్‌ను చూపడంలో అస్సలు వెనుకాడలేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023తో మరోసారి వార్తల్లో నిలిచాడు గౌతం గంభీర్. క్రికెట్‌కు చాన్నాళ్ల కిందటే గుడ్‌బై చెప్పిన ఈ టీమిండియా మాజీ ఓపెనర్.. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. బీజేపీ తరఫున ఎంపీగా నిలబడి గెలిచాడు. అయితే రెండేళ్ల కింద ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆఫర్ చేయడంతో ఆ టీమ్‌కు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు క్రికెట్‌ను సమతూకం చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ సీజన్ ఐపీఎల్లో మాత్రం గంభీర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. విరాట్ కోహ్లీతో వివాదంతో ఒక్కసారిగా వార్తల్లో చర్చనీయాంశంగా మారాడు గంభీర్.
కోహ్లీతో గొడవలో గంభీర్ చూపించిన అగ్రెషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ గొడవలో ఎవరి తప్పు అనేది పక్కనబెడితే.. గంభీర్‌కు కోపం ఎక్కువనేది మరోసారి బయటపడింది. గతంలోనూ మైదానంలో పలువురు ప్లేయర్లతో గొడవల సమయంలో గంభీర్‌కు ఎంత కోపం ఉందో అందరూ చూశారు. కానీ ప్లేయర్ నుంచి కోచింగ్ స్టాఫ్‌లో ఒకరిగా మారినా ఆయనకు కోపం తగ్గలేదనేది కోహ్లీతో రీసెంట్ గొడవతో తేలిపోయింది. ఇదిలా ఉంటే.. గంభీర్లో మరో యాంగిల్ కూడా ఉంది. ఆయనకు కోపమే కాదు వెన్న లాంటి మంచి మనసు కూడా ఉంది.
అడగ్గానే సాయం చేసేంత గొప్ప మనసు గంభీర్‌కు ఉంది. ఈ విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. టీమిండియా సీనియర్ క్రికెటర్ రాహుల్ శర్మ అత్తయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. బ్రెయిన్ హెమోరేజ్తో బాధపడుతున్న తన అత్తయ్య చికిత్సకు అవసరమైన సాయాన్ని గంభీర్ చేశాడని రాహుల్ తెలిపాడు. తన అత్తయ్యతో కలసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న రాహుల్ శర్మ.. ఆమె ఆపరేషన్‌కు సాయం అందించాలని అడగ్గానే గంభీర్ వెంటనే స్పందించాడని చెప్పాడు. బెస్ట్ న్యూరాలజిస్ట్‌తో సర్జరీ చేయించారని.. తన అత్తయ్య ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని రాహుల్ శర్మ చెప్పుకొచ్చాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ గొప్ప మనసును చాటుకున్నాడని మెచ్చుకుంటున్నారు.
Gautam Gambhir financially helped Rahul Sharma whose mother in law was in critical condition.
A beautiful gesture by GG! pic.twitter.com/LB6x9OnpGL
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 9, 2023