సూపర్ ఫామ్ లో ఉన్న ఆటగాడిపై ఏ ఫ్రాంఛైజీ అయినా కోట్లు గుమ్మరిస్తుంది. ఐపీఎల్ లో ఇది జగమెరిగిన సత్యం. అలా కాకుండా ఓ ఆటగాడిని నమ్మి.. అతడిపై కోట్లు కుమ్మరించడం అంటే సాహసం అనే చెప్పాలి. అలాంటి సాహసమే చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ మెంటర్ గౌతమ్ గంభీర్. తాజాగా ఇన్నింగ్స్ తో గంభీర్ పరువు కాపాడాడు నికోలస్ పూరన్.
ఐపీఎల్ అనగానే అందరికి ఫోర్లు, సిక్సర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే ఆ సిక్సర్ల బాదే బ్యాటర్ల వెనక ఓ పెద్ద కథలే దాగి ఉంటాయి అనేది కాదనలేని వాస్తవం. ఇక ఆ సిక్సర్లు కొట్టే బ్యాటర్లను ముందుగానే పసిగట్టి.. వేలంలో కొనుగోలు చేయడం అనేది కత్తిమీద సాము లాంటి విద్య. ఈ విద్య అందరికి అబ్బదు. సూపర్ ఫామ్ లో ఉన్న ఆటగాడిపై ఏ ఫ్రాంఛైజీ అయినా కోట్లు గుమ్మరిస్తుంది. ఐపీఎల్ లో ఇది జగమెరిగిన సత్యం. అలా కాకుండా ఓ ఆటగాడిని నమ్మి.. అతడిపై కోట్లు కుమ్మరించడం అంటే సాహసం అనే చెప్పాలి. అలాంటి సాహసమే చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ మెంటర్ గౌతమ్ గంభీర్. ఓ స్టార్ ఆల్ రౌండర్ ను కాదని పూరన్ దక్కించుకున్నాడు. ఇక తాజా మ్యాచ్ లో పూరన్ విశ్వరూపం చూపించడంతో.. గంభీర్ పరువు కాపాడాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏ స్టార్ ఆల్ రౌండర్ ని కాదని పూరన్ ను దక్కించుకున్నారో ఇప్పుడు చూద్దాం.
గౌతమ్ గంభీర్.. ఈ పేరు వినగానే కోపిష్టి.. ధోనిని, విరాట్ ను ద్వేషించే వాడు అని అందరు అనుకుంటారు. కానీ అతడిలో గొప్ప ఆలోచనా పరుడు ఉన్నాడని ప్రస్తుతం అందరికి తెలిసింది. అంత గొప్ప ఆలోచనాపరుడు మీకెప్పుడు కనిపించాడు అని మీకు డౌట్ రావొచ్చు.. నిజమే. గంభీర్ ఓ గొప్ప స్ట్రాటజీ కలిగిన వ్యక్తి అని ఐపీఎల్ 2023 మినీ వేలంలోనే రుజువు అయ్యింది. ప్రస్తుతం ఆ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్ 2023 మినీ వేలం జరుగుతోంది. ఫ్రాంఛైజీలు అన్ని స్టార్ ఆల్ రౌండర్స్ వైపు మెుగ్గుచూపుతున్నాయి. దాంతో వారిపై కోట్లకు కోట్లు కుమ్మరిస్తు.. దక్కించుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కోసం చెన్నై ఫ్రాంఛైజీతో తీవ్రంగా పోటీ పడింది లక్నో యాజమాన్యం. చివరిదాక వచ్చి బెన్ స్టోక్స్ పై రూ.16 కోట్లు బిడ్ వేసి ఆపేసింది. కానీ చెన్నై రూ.16.25 కోట్లు పెట్ట అతడిని కొనుగోలు చేసింది. దాంతో అక్కడ ఉన్న వారంత గంభీర్ ను చూసి నవ్వారు. కేవలం రూ. 25 లక్షల తేడాతో ఆ స్టార్ ఆటగాడిని వదిలేశారు అని. అయితే గంభీర్ మాత్రం తన మాస్టర్ మైండ్ తో ఆ రూ. 16 కోట్లు పెట్టి విండీస్ వీరుడు నికోలస్ పూరన్ ను కొనుగోలు చేశాడు. అయితే ఐపీఎల్ 2023 సీజన్ తొలి మ్యాచ్ ల్లో అంతగా ప్రభావం చూపించని పూరన్.. కీలకమైన మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. ఓడిపోయే మ్యాచ్ న్ గెలిపించి లక్నో హీరో అయ్యాడు. అటు స్టోక్స్ మాత్రం పెట్టిన ధరకు న్యాయం చేయలేకపోతున్నాడు.
ఇక ఇక్కడ గంభీర్ మాస్టర్ మైండ్ అని ఎందుకు అంటున్నారు అంటే.. లక్నో జట్టులో కీపర్ గా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నప్పటికీ పూరన్ తీసుకున్నందుకు. ఇక రూ.16 కోట్లు పెట్టి తనపై ఇంత నమ్మకం ఉంచినందుకు.. గంభీర్ పరువు కాపాడాడు పూరన్. లేదంటే అన్ని కోట్లు పెట్టిన పూరన్ విఫలం అయితే.. అందరి ముందు గంభీర్ ఓ దోషిలా నిలబడేవాడు. ఎందుకంటే పట్టు పట్టి మరీ పూరన్ పై అన్ని కోట్లు కుమ్మరించాడు గంభీర్. మరి గంభీర్, పూరన్ పై అన్ని కోట్లు ఖర్చు పెట్టడం, అతడు గంభీర్ పరువుకాపాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.