అసలే మ్యాచ్ గెలిచి బాధలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ కు మరింత చిర్రెత్తేలా లక్నో మెంటార్ గంభీర్ ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. ఇంతకీ అసలు ఏం జరిగింది?
ఏదైనా మ్యాచ్ జరుగుతున్నప్పుడు క్రికెటర్ల మధ్య అన్ని రకాల ఎమోషన్స్ వస్తుంటాయి. కొందరు కంట్రోల్ చేసుకుంటే.. మరికొందరు మాత్రం వాటిని బయటపెట్టేస్తుంటారు. కుర్రాళ్లు ఇలా చేశారంటే ఓకే గానీ.. ఎంతో అనుభవమున్న క్రికెటర్లు ఇలా చేశారంటే మాత్రం కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా ఐపీఎల్ లో బెంగళూరు-లక్నో మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన ఈ మ్యాచ్ లో లక్నో గెలిచేసింది. మ్యాచ్ తర్వాత ఆ జట్టు మెంటార్ గంభీర్ చేసిన పని, ఆర్సీబీ ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి ఐపీఎల్ లోనూ ఆర్సీబీకి అస్సలు కలిసి రావడం లేదు. ముంబయిపై ఎలాగోలా ఫస్ట్ మ్యాచ్ గెలిచేసింది. కానీ కోల్ కతా, లక్నో చేతిలో మాత్రం వరసగా ఓడిపోయింది. బ్యాటర్లు బాగానే ఆడుతున్నా బౌలర్లు పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. దీంతో ఎన్ని రన్స్ కొట్టినా ఉపయోగం లేకుండా పోయింది. లక్నోతో మ్యాచే తీసుకోండి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. ఏకంగా 212/2 పరుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లీ(61), డుప్లెసిస్(79 నాటౌట్), మ్యాక్స్ వెల్(59) అదరగొట్టారు. కానీ ఆ తర్వాత జట్టులో బౌలర్లు పూర్తిగా గాడితప్పారు. అదే టైంలో లక్నో జట్టులోని స్టోయినిస్, పూరన్.. ధనాధన్ ఇన్నింగ్స్ లతో విజయానికి తమ జట్టుని గెలిపించేశారు.
అయితే లక్నోకు మెంటార్ గా వ్యవహరిస్తున్న గంభీర్.. మ్యాచ్ గెలిచేసరికి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇరుజట్ల ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో.. మైదానంలో గట్టిగా అరుస్తున్న ప్రేక్షకుల్ని చూసి ‘నోరు మూసుకోండి’ అన్నట్లు సైగ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ సీనియర్ క్రికెటర్, ఎంపీ అయ్యుండి ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ‘ఇది మీ రోజు. మా టైమ్ వచ్చినప్పుడు తిరిగి చెల్లిస్తాం’ అని ఫ్యాన్స్ అంటున్నారు. మరి గంభీర్.. నోటిపై వేలు పెట్టి సిగ్నల్ చూపించడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
#RCBvsLSG
Gautam Gambhir to the Chinnaswamy crowd after the match.pic.twitter.com/PrGOrB1Uny— 👌⭐👑 (@superking1815) April 10, 2023