సన్‌రైజర్స్ జట్టుపై నెట్టింట చవాకులు పేలుతున్నాయి. ఆటగాళ్లను ఏమీ అనలేని అభిమానులు కోట్లకు కోట్లు వెచ్చించి వారిని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ యజమాని కావ్యా పాపను తిడుతున్నారు.
“ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా
నలుపు నలుపే గాని తెలుపు కాదు
కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా
విశ్వధాభిరామ, వినుర వేమ“..ఈ వేమన పద్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సరిగ్గా సరితూగుతుంది. కోట్లు కుమ్మరించి విలువైన ఆటగాళ్లను ఏరి కోరి పట్టుకొచ్చినా.. జట్టు ఫలితం ఏమాత్రం మారడం లేదు. ప్రత్యర్థి జట్టు ఏదైనా ఓటమి మాదే అన్నట్లుగా సన్‌రైజర్స్ ప్రయాణం సాగుతోంది. దీంతో నెట్టింట సన్‌రైజర్స్ జట్టుపై చవాకులు పేలుతున్నాయి.
హ్యారీ బ్రూక్, ఐడెన్ మార్కరమ్, మార్కో జెన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్.. వీళ్ళందరూ మంచి ఆటగాళ్లే. ఆయా దేశాల జట్లకు మంచిగా రాణించిన వారే. కానీ ఏమయ్యిందో పాపం.. సన్‌రైజర్స్ జట్టులోకి వచ్చేసరికి అందరూ విఫలమవుతున్నారు. పోనీ ఒక మ్యాచ్ అంటారా! గత మ్యాచులోనూ ఇదే ప్రదర్శన. రాబోవు మ్యాచులోనూ ఇదే పునరావృతం కావచ్చు. అదే ఎస్ఆర్‌హెచ్ అభిమానుల భయం. దీంతో వీరిని ఏమీ అనలేక కోట్లకు కోట్లు వెచ్చించి వీరిని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ యజమాని కావ్యా పాపను తిడుతున్నారు.
వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో ఆటగాడు.. హ్యారీ బ్రూక్. ఇతగాడిలో కావ్యా పాప ఏం చూసిందో తెలియదు కానీ, వేలం పాటలో ఇతడిపై కోట్లు కుమ్మరించింది. ఏకంగా రూ. 13.25 కోట్లు పెట్టి అతన్ని కొనుగోలు చేసింది. కానీ అతడు ఆడుతుంది మాత్రం.. ఒక్కో పరుగుకు ఒక్కో కోటి అన్నట్లు ఆడుతున్నాడు. పోనీ అలా అనుకున్నా తొలి మ్యాచులో 13 పరుగులు లెక్క సరిపోయింది అనుకోండి. అదే రెండో మ్యాచులో 3 పరుగులు. అంటే ఒక్కో పరుగు నాలుగు కోట్ల పైమాటే. ఇది చాలా కాస్ట్‌లీ కదా! అందుకే ‘అతనిలో ఏం చూసి నమ్మింది కావ్యా పాప..’ అంటూ అభిమానులు నెట్టింట ట్రోలింగ్ మొదలు పెట్టారు. ‘ఇంత దారుణంగా మోసపోయావేంటి పాప..’ అంటూ ఆమెపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
Sunrisers Hyderabad to Harry Brook 😂 pic.twitter.com/kDkSxvM7aT
— Suraj Karmakar (@SurajKa86420317) April 7, 2023
ఇక ఐపీఎల్ 2023లో భాగంగా నేడు లక్నో సూపర్ గెయింట్స్ తో తలపడుతున్న సన్‌రైజర్స్ పరువు కోసం పోరాడుతోంది. టాస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్‌హెచ్ లక్నో ముంగిట కనీసం 120 పరుగుల లక్ష్యాన్ని అయినా నిర్ధేశిస్తుందా అన్నది తెలియడం లేదు. పోటీ పడి మరీ ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లు ఒకరివెంట మరొకరు పెవిలియన్ చేరిపోయారు. ప్రస్తుతం సన్‌రైజర్స్ 17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 92 చేసింది. ఈ మ్యాచులో లక్నో విజయం దాదాపు లాంఛనమే. సన్‌రైజర్స్ జట్టుపై, యజమాని కావ్యా పాపపై.. మీ అభిప్రాయాలేంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Test khel rahe ye to 🙂 #SRHvsLSG #TATAIPL #harrybrook #CSKvsMI #LSGvSRH pic.twitter.com/vacYrJeb3U
— Mohammed Nayeem (@PMN2463) April 7, 2023
SRH owners about Harry Brook 🙂#LSGvsSRH pic.twitter.com/49xz7PRBbG
— ABHI 🇮🇳❤ (@Abhi__Tweetz) April 7, 2023