మాములుగా అభిమానులు స్టేడియంలో తమకి ఇష్టమైన క్రికెటర్ మీద అభిమానం చూపిస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలా కానిచో మ్యాచును బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ నిన్న మ్యాచులో మాత్రం అభిమానులు అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా స్టేడియంలో కొట్టుకుంటూ కనిపించారు.
ఐపీఎల్ సెకండ్ హాఫ్ మొదలయింది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ప్లే ఆఫ్ బెర్త్ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా నిన్న సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరగగా ఈ మ్యాచులో మార్కరం సేన 9 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఫోర్లు సిక్సులు చూసిన అభిమానులు ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా స్టేడియంలో కొట్టుకుంటూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
మాములుగా అభిమానులు స్టేడియంలో తమకి ఇష్టమైన క్రికెటర్ మీద అభిమానం చూపిస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలా కానిచో కొంతమంది మ్యాచును బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ నిన్న మ్యాచులో మాత్రం అభిమానులు అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. దాదాపు స్టేడియం అంతటా నిండిపోగా.. ఒక చోట కొంతమంది అభిమానులు ఫైటింగ్ చేసుకుంటూ కనిపించారు. ఒకరిపై మరొకరు పిడి గుద్దులు కురిపించుకున్నారు. కుర్చీలపై నెట్టేసుకున్నారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ గొడవకు కారణమేంటో ఇంకా తెలియలేదు.
ఇక ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ బాగా ఆడి హాఫ్ సెంచరీ చేయగా.. క్లాసేన్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడాడు. వీరికి తోడు అబ్దుల్ సమద్, హుస్సేన్ కూడా రాణించడంతో 198 పరుగుల భారీ లక్ష్యాన్ని డెలి క్యాపిటల్స్ మీద ఉంచింది. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఓపెనర్ వార్నర్ తొలి ఓవర్లో డకౌట్ గా వెనుదిరిగినా.. సాల్ట్ , మార్ష్ భారీ భాగస్వామ్యం జట్టుని గెలుపు దిశగా తీసుకెళ్లింది. అయితే కీలక దశలో సన్ రైజర్స్ బౌలర్లు వికెట్లు తీసుకోవడంతో 9 పరుగుల విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఇటీవలే సొంత గడ్డపై ఎదురైన ఓటమికి రివెంజ్ తీర్చుకుంది.
A fight took place between fans in Delhi during their match against SRH. pic.twitter.com/MYPj6dqejb
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2023