ధోని వికెట్ల మధ్య పరిగెత్తుతుంటే చిన్న పాటి ఓ చిరుత పులి పరిగెడుతుందా? అన్న అనుమానం కలగక మానదు. అంతలా ఫిట్ నెస్ సాధించిన ధోని తాజాగా గుజరాత్ తో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో అంత ఫిట్ గా కనిపించలేదు. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లలో డైవ్ చేసిన తర్వాత అంత కంపర్టబుల్ గా కనిపించలేదు. కనీసం లేచి నిలబడలేని పరిస్థికి వచ్చాడు. దాంతో ధోనిని ఇలా ఎప్పుడూ చూడలేదని అభిమానులు బాధపడుతున్నారు.
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వినగానే మిస్టర్ కూల్, ధనాధన్, మాస్టర్ మైండ్, ఫిట్ నెస్ కా బాప్ లాంటి పదాలు మన మైండ్ లో మెదులుతాయి. ఇక ధోని వికెట్ల మధ్య పరిగెత్తుతుంటే చిన్న పాటి ఓ చిరుత పులి పరిగెడుతుందా? అన్న అనుమానం కలగక మానదు. అవతలి ఎండ్ లో ఉన్న బ్యాటర్ క్రీజ్ లోకి వెళ్లకు ముందే ధోని రన్ పూర్తి చేసి రెండో రన్ కోసం పిచ్ సగానికి పైగా వస్తాడు. ఈ విషయం మనం క్రికెట్ లో ఎన్నో సార్లు గమనించాం. అంతలా ఫిట్ నెస్ సాధించిన ధోని తాజాగా గుజరాత్ తో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో అంత ఫిట్ గా కనిపించలేదు. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లలో డైవ్ చేసిన తర్వాత అంత కంపర్టబుల్ గా కనిపించలేదు. కనీసం లేచి నిలబడలేని పరిస్థికి వచ్చాడు. దాంతో ధోనిని ఇలా ఎప్పుడూ చూడలేదని అభిమానులు బాధపడుతున్నారు.
MS ధోని.. సమకాలీన క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఫిట్ నెస్ ఉన్న ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 41 సంవత్సరాల వయసులోనూ ఎంత ఫిట్ గా ఉన్నాడో తాజా మ్యాచ్ లో చూశాం. ప్రాక్టీస్ మ్యాచ్ లో సైతం తన ధోని బరిలోకి దిగే ఫోటోలు ఫిట్ నెస్ కా బాప్ అన్న రీతిలో ఉన్నాయి. ఇక ధోని వికెట్ల మధ్య పరిగెత్తే వేగానానికి ఒక్క కోహ్లీ తప్ప మరే ఆటగాడు సరితూగడు అనే చెప్పాలి. అయితే గత కొంత కాలంగా ధోని ఫిట్ నెస్ తగ్గుతూ వస్తోంది అన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. 41 సంవత్సరాల వయసులో ఫిట్ నెస్ ను కాపాడుకోవడం అంటే కత్తి మీద సాము అనే చెప్పాలి. ప్రస్తుతం ధోని తన ఫిట్ నెస్ కాపాడుకోవడానికి ఇదే చేస్తున్నాడు.
గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు ధోని. దాంతో ధోని ఫిట్ నెస్ పై మరిన్ని వార్తలు వైరల్ గా మారాయి. ఇక తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో దీపక్ చహర్ వేసిన బంతిని అడ్డుకోబోయి డైవ్ చేశాడు. అనంతరం లేచిన ధోని కొంత టైమ్ వరకు అడుగు ముందుకు వేయలేకపోయాడు.ఆ తర్వాత కూడా అంత కంపర్టబుల్ గా కనిపించలేదు మిస్టర్ కూల్. ఇక ఈ వీడియోలను టీవీల్లో సోషల్ మీడియాల్లో చూసిన అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. ఎప్పుడూ హుషారుగా చిరుతలా పరిగెత్తే ధోనిని ఇలా చూస్తామని అనుకోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.