KL Rahul: చాలా కాలంగా ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్ కనీసం ఐపీఎల్‌లోనైనా ఫామ్‌లోకి వస్తాడని ఆశించినా.. అది జరగడం లేదు ఆర్సీబీపై దారుణంగా వన్డే ఇన్నింగ్స్ ఆడాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఐపీఎల్ సీజన్ 16లో అభిమానులకి కావాల్సినంత వినోదం దొరుకుతుంది. గాయాలతో స్టార్ ప్లేయర్లు దూరమైనా.. ఆ లోటు క్రికెట్ ప్రేమికుల్లో ఎక్కడా కనబడడం లేదు. ఇప్పటికే అనేక హోరాహోరీ మ్యాచ్ లు చూసేసిన ప్రేక్షకులకు.. సోమవారం ఆర్సీబీ, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్ కి గురి చేసింది. చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడి.. చివరికి లక్నోను వరించింది. మ్యాచ్ ఆధ్యాంతం ఇరు జట్లలోని స్టార్ బ్యాటర్లు సిక్సులు, ఫోర్లతో హోరెత్తించగా.. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం తన జిడ్డు బ్యాటింగ్ తో విసుగు తెప్పించాడు. అయితే తాను ఇలా బ్యాటింగ్ చేయడంపై సమర్ధించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కళ్ల ముందు భారీ లక్ష్యం. పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంది. ఓ వైపు వికెట్లు పడుతుండడంతో.. లక్నో టీమ్ 7 ఓవర్లలో 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. అప్పటివరకు కాస్త చిన్నగా ఆడిన రాహుల్-స్టోయినీస్ ద్వయం గేర్ మార్చాల్సిన టైం రానే వచ్చింది. కొట్టాల్సిన రన్ రేట్ 13 ఉండడంతో.. స్టోయినీస్ శివాలెత్తే ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కానీ మరో ఎండ్ లో కెప్టెన్ రాహుల్ మాత్రం బ్యాట్ ని ఝుళిపించే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. మొత్తం 20 బంతులు ఆడిన రాహుల్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసాడు. ఇందులో కేవలం ఒక్క బౌండరీ మాత్రమే ఉంది. వికెట్లు పడుతున్నప్పుడు ఇలా ఆడడం బాగానే ఉన్నా.. కొట్టాల్సిన రన్ రేట్ పెరిగిపోతున్నా రాహుల్ కేవలం సింగిల్స్ కే పరిమితమవ్వడం ఆశ్చర్యం కలిగించింది. అసలు రాహుల్ కి స్ట్రాటజీ ఏమైనా ఉందా ? లేకపోతే పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడా? అనిపించేలా ఈ ఓపెనర్ బ్యాటింగ్ కొనసాగింది. చివరికి సిరాజ్ బౌలింగ్‌లో అవుటై నిరాశపరిచాడు.
రాహుల్ అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సహచరుడు స్టోయినీస్ ఆడియన్ ఇన్నింగ్స్ ని వృధా చేయకుండా కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి మ్యాచ్ ని లక్నో వైపుకి తిప్పాడు. ఇక చివర్లో కాస్త టెన్షన్ కి గురి చేసినా.. ఒక్క వికెట్ తేడాతో రాహుల్ సేన విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ గెలిచినా రాహుల్ ఇన్నింగ్స్ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన ఇన్నింగ్స్ పై మాట్లాడుతూ.. “జట్టు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను అలా ఆడడం కరెక్ట్ అనిపించింది. ఒకవేళ నేను చివరివరకు గ్రీజ్ లో ఉంది ఉంటే మ్యాచ్ చాలా ఈజీగా గెలిచేవాళ్ళం”. అని చెప్పుకొచ్చాడు. నిజంగా రాహుల్ చివరి వరకు గ్రీజ్ లో ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Gorgeous gorgeous 18 runs of just 20 balls with a gigantic strike of 90 in the chase of 213 runs at Chinnaswamy…ufffff🙈
Professor KL Rahul The man is a storybook all by himself. There is no work of fiction more fanciful🔥😍 #RCBvLSG pic.twitter.com/qRxeP2vgNS
— TukTuk Academy (@TukTuk_Academy) April 10, 2023