చెన్నై సూపర్ కింగ్స్.. ఫాఫ్ డుప్లెసిస్ కి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.డుప్లెసిస్ ఐపీఎల్ లో అందరికీ తెలియడానికి ధోనీనే కారణం. అయితే తాజాగా.. డుప్లెసిస్ ధోనిని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.
చెన్నై సూపర్ కింగ్స్.. ఫాఫ్ డుప్లెసిస్ కి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్సీబీ జట్టులో అడుగుపెట్టకముందు వరకు ధోని కెప్టెన్సీలో ఆడుతూ బాగా రాటుదేలాడు. సూపర్ కింగ్స్ జట్టుపై రెండేళ్లు నిషేధం విధించిన తర్వాత కూడా ధోని కెప్టెన్ గా ఉన్న పూణే జట్టుకే డుప్లెసిస్ ఆడాడు. మొదట్లో వాట్సన్, ఆ తర్వాత గైక్వాడ్ తో కలిసి ఎన్నో సంచలన ఇన్నింగ్స్ లు ఆడి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. డుప్లెసిస్ ఐపీఎల్ లో అందరికీ తెలియడానికి ధోనీనే కారణం. అయితే తాజాగా.. డుప్లెసిస్ ధోనిని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. ప్రస్తుతం ఆర్సీబీ జట్టుకి కెప్టెన్ గా ఉంటున్న ఫాఫ్.. నిన్న రాజస్థాన్ తో మ్యాచ్ గెలిచిన అనంతరం ధోనిపై ఈ వ్యాఖ్యలు చేసాడు.
ఐపీఎల్ లో భాగంగా నిన్న (ఆదివారం) రాజస్థాన్, బెంగళూర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఆర్సీబీ.. రాజస్థాన్ జట్టుని చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగుల స్కోర్ చేసింది. జట్టులో మ్యాక్స్ వెల్ (54), డుప్లెసిస్ (55) అర్ధ సెంచరీలతో రాణించగా.. చివర్లో అనుజ్ రావత్ మెరుపు ఇన్నింగ్స్(11 బంతుల్లో 29) ఆడాడు. ఇక లక్ష్య ఛేదనలో రాజస్థాన్ జట్టు కేవలం 59 పరుగులకే కుప్పకూలింది. రాజస్థాన్ టీంలో ఏకంగా నలుగురు ప్లేయర్లు డకౌట్ గా వెనుదిరగ్గా.. మరో 5 గురు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దీంతో ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచులో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం డుప్లెసిస్ జట్టు విజయం గురించి మాట్లాడుతూ ధోని గురించి కూడా మాట్లాడాడు.
“నిజంగా చెప్పాలంటే నేను చెన్నై జట్టుకి ఆడనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నా బ్యాటింగ్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. ఒకవేళ నేనెను ఇలాంటి ఇన్నింగ్స్ లు చెన్నై జట్టుకి ఆడి ఉంటే బహుశా క్రెడిట్ అంతా ధోనికి వెళ్లిపోయేదేమో అని చెప్పుకొచ్చాడు”. అయితే డుప్లెసిస్ ఈ వ్యాఖ్యలు సరదాగా చేయడం గమనార్హం. ఈ మ్యాచులో డుప్లెసిస్ 55 పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. మొత్తానికీ గెలవాల్సిన మ్యాచులో జయభేరి మోగించిన ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. మరి ధోని మీద డుప్లెసిస్ సరదాగా చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.
Faf Du Plessis : To be honest I am glad that I don’t play for CSK anymore otherwise they would’ve credited Dhoni for my performance (Laughs) pic.twitter.com/mgfyanOATi
— Kevin (@imkevin149) May 14, 2023