పాయింట్ల పట్టికలో టాప్-3లోకి వచ్చేసిన చెన్నైకి మరో ప్రాబ్లమ్ వచ్చింది. ఆడాల్సిన ఓ మ్యాచ్ పై ఎన్నికల ఎఫెక్ట్ పడింది. ఈ విషయాన్ని అధికారికంగానూ ప్రకటించారు.
ఐపీఎల్ లో ఏ మ్యాచ్ అయినా సరే మినిమం సందడి గ్యారంటీ. ప్రేక్షకుల హడావుడి అదే రీతిలో ఉంటుంది. వేలాది మంది మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వస్తారు. కాబట్టి ఆ పరిసర ప్రాంతాలు అంతా చాలా రష్ గా ఉంటాయి. కాబట్టి ఎలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ ఆ టైంలో లేకుండా చూసుకుంటారు. అందుకు తగ్గట్లే మ్యాచ్ ల్ని షెడ్యూల్ చేస్తారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు ఓ కష్టం వచ్చింది. తను ఆడాల్సిన ఓ మ్యాచ్ పై ఎన్నికల ప్రభావం పడింది. ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ముందే చూసుకోరా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెప్పగానే ధోనీ గుర్తొస్తాడు. అయితే అనుకున్నంత రేంజులో ఈసారి ఫెర్ఫార్మ్ చేయలేకపోతోంది అనిపిస్తోంది. గుజరాత్, రాజస్థాన్ పై ఓడింది. కానీ మిగతా మూడు మ్యాచుల్లో విజయాలు సాధించి.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఆర్సీబీపై 8 పరుగుల తేడాతో గెలిచిన చెన్నై.. కొన్నిరోజుల తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇప్పుడు ఆ మ్యాచ్ కాస్త ఎన్నికల వల్ల రీషెడ్యూల్ అయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తేదీలోనూ మార్పు చేశారు.
మే 4న చెన్నై-లక్నో జట్ల మధ్య లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అదే రోజు ఆ సిటీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఓ రోజు ముందుకు మ్యాచ్ ని మార్చారు. ముందు చెప్పిన దాని ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకే మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ విషయం తెలిసి కొందరు ఫ్యాన్స్ అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక్క మ్యాచ్ కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. అదే ఎక్కువ మ్యాచ్ లకు ఇలా జరుగుంటే టోర్నీకి ఇబ్బంది కలిగేది అని నెటజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి చెన్నై మ్యాచ్ పై ఎలక్షన్ ఎఫెక్ట్ పడటంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.