మిగతా జట్ల అభిమానులు చేశారంటే ఓ అర్థముంది. కానీ ఆర్సీబీని సొంత కెప్టెనే ట్రోల్ చేయడం.. ఈ జట్టు ఫ్యాన్స్ కి మైండ్ పోయేలా చేసింది. ఇంతకీ ఏంటి విషయం?
ఆర్సీబీని చూస్తుంటే నిజంగా పాపం అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతిసారి ‘ఈ సాలా కప్ నమదే’ అనుకోవడం, అది కలగానే మిగిలిపోవడం గత 15 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ఈసారి కూడా అదే రిపీట్ అయ్యే ఛాన్సులు గట్టిగా కనిపిస్తున్నాయి. దీంతో మిగతా జట్ల ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆర్సీబీపై రకరకాల కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఇలాంటి టైంలో జట్టుని ముందుండి నడిపించాల్సిన కెప్టెనే.. సొంత జట్టుని ట్రోల్ చేస్తున్నాడు! ఈ విషయం కాస్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోహ్లీ. ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి ఫెవికోల్ గట్టిగా ఈ బాండింగ్ కొనసాగుతోంది. పలుమార్లు ఫైనల్ లో అడుగుపెట్టినప్పటికీ కప్పు మాత్రం ఇప్పటివరకు కొట్టలేకపోయింది. ఆ దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ముందే ఐపీఎల్ కెప్టెన్సీ నుంచీ కోహ్లీ తప్పుకొన్నాడు. దీంతో ఇప్పుడు డుప్లెసిస్.. ఆర్సీబీకి కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. గాయంతో ఇబ్బందిపడుతున్నాసరే ఓపెనర్ గా పూర్తి న్యాయం చేస్తున్నాడు. ప్రస్తుం ఆరెంజ్ క్యాప్ తో కొనసాగుతున్నాడు. అలాంటిది ఇప్పుడు సొంత టీమ్ నే ట్రోల్ చేశాడు!
ఈ ఐపీఎల్ సీజన్ మొదలవడానికి ముందు మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా డుప్లెసిస్.. ‘ఈ సాలా కప్ నమదే’ అనబోయి ‘ఈ సాలా కప్ నహీ’ (ఈసారి కప్పు రాదు) అని అన్నాడు. అప్పట్లో ఇది చూసి అందరూ నవ్వుకున్నారు కానీ ఇప్పుడదే నిజమయ్యేలా కనిపిస్తుంది. తాజాగా టీమ్ ని ఉత్సాహపరుస్తూ ఆర్సీబీ ఓ ట్వీట్ చేసింది. ‘ఎన్ని అడ్డంకులు ఎదురైనా దూసుకెళ్తాం’ అనే క్యాప్షన్ తో తుపానులో ఆర్సీబీ ప్లేయర్లు అందరూ పడవ నడుపుతున్నట్లు ఫొటో పోస్ట్ చేశారు. దీనికి ఫన్ ఈమోజీలు పెట్టిన కెప్టెన్ డుప్లెసిస్ మొత్తం కామెడీ చేసేశాడు. ప్రస్తుతం ఇది అతడి ఇన్ స్టా స్టోరీలో ఉంది. కావాలంటే మీరు కూడా చూడండి. ఇది ఫన్ కోసమే పెట్టినప్పటికీ.. ఫ్యాన్స్ ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే ఆర్సీబీని సొంత కెప్టెనే ట్రోల్ చేస్తుండటంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.