భారత సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ మరోసారి వార్తల్లోకెక్కారు. అలా అని ఇది గుడ్ న్యూస్ కాదు. అతనిపై ఆర్సీబీ అభిమానులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. 'జట్టు నుంచి తప్పుకొని ఇంట్లో కూర్చోవచ్చుగా..' అంటూ మరీ పచ్చిగా తిడుతున్నారు. అతలా తిట్టిపోయడానికి ఇతను ఏం చేశాడు అనుకుంటున్నారా..? అత్యంత చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.
టీమిండియా వెటరన్ క్రికెటర్, ప్రస్తుత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ గతేడాది ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. కీలక సమయంలో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడి విలువైన ఆటగాడిగా నిరూపించుకున్నాడు. అదే ఊపుతో టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఇది గతం. కానీ ప్రస్తుత సీజన్ లో డీకే ప్రదర్శన.. అత్యంత చెత్తగా సాగుతోంది. వరుసగా విఫలమవుతూ అభిమానుల చేత చీవాట్లు తింటున్నాడు. దీనికి తోడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక డక్‌లు అయిన ఆటగాడిగా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
‘డీకే.. డీకే.. డీకే’ గతేడాది ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ మ్యాచ్ ఎక్కడ జరిగిన ఈ పేరు మార్మోగేది. అందుకు తగ్గట్టుగానే దినేష్ కార్తీక్ జట్టుకు అవసరమైన ప్రతి సందర్భంలోనూ రాణించాడు. ఐపీఎల్-2022 సీజన్‌లో మొత్తంగా 16 మ్యాచ్‌లలో కలిపి 330 పరుగులు చేశాడు. దీంతో అతనికి జాతీయ జట్టులో పునరాగమనం చేసే అవకాశం లభించింది. టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో అందరూ ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌ను టీమిండియా మాజీ సారథి, అత్యుత్తమ ఫినిషర్‌తో మహేంద్ర సింగ్ ధోనితో పోలుస్తూ కామెంట్లు చేశారు. మరో పదేళ్ల పాటు భారత జట్టుకు ఫినిషర్ లోటు తీరిందంటూ పొగడ్తలు కురిపించారు. తీరా చూస్తే ఏడాది గడిచేలోపే అదంతా తలకిందలయ్యింది. నమ్మకం పెట్టుకున్న డీకే విఫలమవ్వడమే అందుకు బలమైన కారణం.
గత సీజన్ లో అద్భుతంగా రాణించిన దినేశ్ కార్తిక్.. ఈ ఐపీఎల్‌లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆర్సీబీ ఆడిన 4 మ్యాచ్‌ల్లో డీకే చేసిన మొత్తం పరుగులు 10(0, 9, 1, 0). అందులోనూ రెండు సార్లు డకౌట్. ఈ క్రమంలోనే అత్యంత చెత్త రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. శనివారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన డీకే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్(15) అయిన ఆటగాడిగా మన్‌దీప్‌సింగ్‌తో కలిసి తొలి స్థానాన్ని పంచుకున్నాడు. మొత్తం 233 మ్యాచ్‌లు ఆడిన డీకే.. 15 సార్లు పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు. ఇక ఈ జాబితాలో వీరి తర్వాత సునీల్ నరైన్(14 డక్‌లు), రోహిత్ శర్మ(14 డక్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Dinesh Karthik and Mandeep Singh have the most ducks in IPL.
📸: IPL/BCCI#IPL2023 #DineshKarthik pic.twitter.com/E8C5iC9yEo
— CricTracker (@Cricketracker) April 15, 2023
ఈ గణాంకాలు పోస్ట్ చేస్తూ ఆర్సీబీ అభిమానులు అతనిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ‘ఆటకు విరామం పలికి.. వెళ్లి కామెంట్రీ చెప్పుకోపో..’ అని కొందరు కామెంట్స్ చేస్తుండగా, ‘వయసు మళ్లింది.. ఇకనైనా ఇంట్లో కూర్చోవడం నయం..’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విమర్శలు తప్పాలంటే నేడు చెన్నైతో జరిగే మ్యాచులోనైనా డీకే రాణించాల్సిందే. చూడాలి మరి ఏమాత్రం రాణిస్తాడో. డీకేపై.. ఈ విమర్శలు రావడం సమంజసమేనా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dinesh Karthik in IPL2023 So far
0(3)
9(8)
1(1)*
0(1)Those who compare me with Dhoni should be jailed. pic.twitter.com/lowdzlkoTz
— ` (@kurkureter) April 15, 2023