ధోనీ సాధారణంగా ఎవరికీ మాటివ్వడు. అలాంటిది పతిరానా ఫ్యామిలీకి మాత్రం ఈ కుర్రాడి విషయంలో భరోసా ఇచ్చాడు. ఆ విషయం ప్రస్తుతం ఐపీఎల్ ఫ్యాన్స్ మధ్య చర్చకు కారణమైంది. ఇంతకీ ఏంటి సంగతి?
కెప్టెన్ గా ధోనీ ఒక్కసారి నమ్మాడంటే.. సదరు క్రికెటర్ ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. సురేష్ రైనా, రవీంద్ర జడేజా, అశ్విన్ తోపాటు ఈ లిస్టులో చాలామంది ఉంటారు. అనామక ప్లేయర్లు కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడుతూ స్టార్ హోదా దక్కించుకున్నారు. తాజాగా ఆ జాబితాలో శ్రీలంకకు చెందిన మతీషా పతిరానా చేరాడని చెప్పొచ్చు. పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు. అయినా సరే ధోనీ అతడిపై నమ్మకముంచి డెత్ ఓవర్లలో బౌలింగ్ ఇస్తున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఈ కుర్రాడు అద్భుతాలు చేస్తున్నాడు. ఈ సీజన్ లో చెన్నై ఫైనల్ చేరుకోవడానికి పతిరానా కూడా ఓ కారణమని చెప్పొచ్చు.
అసలు విషయానికొచ్చేస్తే.. లంక కుర్రాడు అయిన పతిరానాని ధోనీ దగ్గరుండి మరీ ప్రోత్సాహిస్తున్నాడు. చెన్నై టీమ్ లో ప్రస్తుతం దీపక్ చాహర్ మాత్రమే బౌలర్లలో సీనియర్. ఇతడికి ఏ మాత్రం తగ్గకుండా పతిరానా బౌలింగ్ చేస్తున్నాడు. మలింగ స్టైల్ యాక్షన్ తో బౌలింగ్ వేస్తున్న ఇతడిని.. టెస్టులు ఆడొద్దని వన్డే, టీ20ల మీద మాత్రమే ఫోకస్ పెట్టాలని కొన్నాళ్ల ముందు ధోనీనే స్వయంగా చెప్పాడు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ యంగ్ ప్లేయర్ పై ధోనీ ఎంత కేర్ తీసుకుంటున్నాడో! ఇది కాదన్నట్లు ఇప్పుడు పతిరానా ఫ్యామిలీకి మహీ ఓ మాట కూడా ఇచ్చేశాడు.
‘మతీషా పతిరానా గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అతడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు’ అని ధోనీ మాట ఇచ్చాడట. ఈ విషయాన్ని చెబుతూ పతిరానా సోదరి తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ధోనీతో కలిసి పతిరానా ఫ్యామిలీ మొత్తం తీసుకున్న ఫొటోలని పోస్ట్ చేసింది. మే 28న అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. దీన్ని చూసేందుకు పతిరానా ఫ్యామిలీ శ్రీలంక నుంచి మన దేశానికి వచ్చారు. ఈ సందర్భంగానే చెన్నైలో ధోనీని వీళ్లు కలిశారు. ఫొటోలు తీసుకున్నారు. ధోనీ వీళ్లకు మాటిచ్చేశాడు. సో అదనమాట విషయం. మరి పతిరానా ఫ్యామిలీకి ధోనీ భరోసా ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.