ఐపీఎల్-2023 తొలి మ్యాచ్ లో చెన్నై జట్టు ఓడిపోయింది. చివరి ఓవర్ వరకు థ్రిల్లింగ్ గా జరిగిన ఈ పోరులో ఓటమి గురించి ధోనీనే మాట్లాడాడు. ఆ తప్పు వల్లే ఈ రిజల్ట్ వచ్చిందని క్లారిటీ ఇచ్చేశాడు.
ఐపీఎల్ తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. గుజరాత్ జట్టు ధోనీసేనపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సీఎస్కే ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అదే టైంలో ‘ఈ మ్యాచ్ దేవుడికి ఇచ్చేశాం. నెక్స్ట్ అన్ని మ్యాచుల్లోనూ విజయం మాదే’ అని అంటున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి కారణం ఏంటా? అని ఆలోచిస్తే మాత్రం అందరికీ ఆన్సర్ దొరికేస్తుంది. మ్యాచ్ తర్వాత మాట్లాడిన ధోనీ కూడా అదే విషయం చెప్పాడు. ఆ తప్పు వల్లే గుజరాత్ పై ఓడిపోయామని అన్నాడు. దీంతో ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92) కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. ఇతడు తప్పించి మిగతా ఏ బ్యాటర్ కూడా ఎఫెక్టివ్ గా ఆడలేకపోయాడు. దీంతో గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై ఓడిపోయింది. అలానే చెన్నై బౌలింగ్ విభాగంలో పెద్దగా సీనియర్లు లేకపోవడం కూడా కాస్త లోటుగా కనిపించింది. మరోవైపు సమష్టి కృషితో ఆడిన గుజరాత్.. చెన్నై వరసగా మూడో మ్యాచ్ గెలిచి అరుదైన ఘనత కూడా నమోదు చేసుకుంది. మ్యాచ్ తర్వాత మాట్లాడిన ధోనీ.. తమ జట్టు మరికొన్ని పరుగులు చేసుంటే గెలిచేవాళ్లమని అన్నాడు.
‘పరుగుల లోటు ఉంటుందని మాకు తెలుసు. అయినా మేం బ్యాటింగ్ లో ఎక్స్ ట్రా రన్స్ కొట్టలేకపోయాం. 15-20 పరుగులు అదనంగా చేసుంటే రిజల్ట్ వేరేలా ఉండేది. రుతురాజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. యంగ్ ప్లేయర్లు అతడిలా ఆడటం చాలా ముఖ్యం. హంగార్గేకర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇంకా అతడు రాటుదేలాల్సి ఉంది. మా బౌలర్లు కూడా చాలా తప్పులు చేశారు. ముఖ్యంగా నో బాల్స్ వేయడం తగ్గించాలి’ అని ధోనీ చెప్పుకొచ్చాడు. మరి తలా చెప్పినట్లు బ్యాటర్లు కాస్త బాగా ఆడి, బౌలర్లు కూడా గుజరాత్ ని కట్టిడి చేసుంటే చెన్నై గెలిచేదేమో కదా! మరి ధోనీ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.