క్రికెట్లో బౌలర్లకు క్రమశిక్షణ తప్పనిసరి. బౌలింగ్‌లో ఏమాత్రం లైన్ అండ్ లెంగ్త్ తప్పినా బౌండరీలు, సిక్సులు సమర్పించుకోవాల్సిందే.
క్రికెట్ రానురాను బ్యాట్స్‌మెన్ గేమ్‌గా మారిపోతోంది. రూల్స్, పిచ్‌తో పాటు అన్నీ బ్యాట్స్‌మెన్ ఫేవర్‌గా అయిపోయాయి. దీంతో బౌలర్లకు గడ్డు కాలం నడుస్తోందని చెప్పాలి. టీ20ల వల్ల బాల్ వేస్తే ఫోర్, సిక్సర్ అనేలా పరిస్థితి తయారైంది. టెస్టు, వన్డే, టీ20.. ఫార్మాట్ ఏదైనా ఇప్పుడు హిట్టింగ్ ఎక్కువైపోయింది. ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచే ఉద్దేశంతో బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్‌లు తయారు చేస్తున్నారు. ఇప్పుడు వాడుతున్న బ్యాట్లు కూడా ఒకప్పటిలా కాదు. స్వీట్ స్పాట్లో తగిలితే చాలు.. ఫోర్ లేదా సిక్స్ గ్యారెంటీ. దీంతో మహామహా బౌలర్లు కూడా భయపడుతున్నారు. క్రమశిక్షణతో బౌలింగ్ చేయకపోతే స్టార్ బౌలర్లకు కూడా ఇబ్బందులు తప్పట్లేదు.
బౌలర్లు కాస్త లైన్ అండ్ లెంగ్త్ తప్పినా బ్యాట్స్‌మెన్ రన్స్ పిండుకుంటున్నారు. అయినప్పటికీ వైవిధ్యంతో బౌలింగ్ చేద్దామనే ప్రయత్నంలో గాడి తప్పి ఒక్కోసారి వైడ్లు, నో బాల్స్ వేస్తున్నారు. ఇవి కామనే అయినప్పటికీ కొన్ని వైడ్లు మాత్రం హాట్ టాపిక్‌గా మారతాయి. అలాంటి ఒక డెలివరీనే ఇది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌కు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే పేస్ బౌలర్ మతీశ పతిరానా వేసిన ఒక వైడ్ చర్చనీయాంశంగా మారింది. అతడు వేసిన వైడ్ బ్యాట్స్‌మెన్‌కే కాదు కీపర్‌కు కూడా అందలేదు. కుడిచేతి వాటం బ్యాటర్‌కు వేసిన బాల్ కాస్తా.. ఎడమ చేతి బ్యాట్స్‌మన్‌కు సూచించే వైడ్ లైన్‌పై పడింది. దీంతో ధోని సహా అందరూ షాక్ అయ్యారు.
A wild delivery from Pathirana.
📸: Jio Cinema pic.twitter.com/jaZaTJJFrn
— CricTracker (@Cricketracker) May 3, 2023