ధోని ఒక్కసారి రివ్యూ తీసుకుంటే అందులో తిరుగుండదు అని మనందరికి తెలిసిన విషయమే. అదీకాక ధోని రివ్యూ తీసుకున్నాడు అంటే అంపైర్లకు సైతం కళ్లు బైర్లు కమ్ముతాయి. అందుకే అభిమానులు ముద్దుగా DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్ అంటూంటారు. తాజాగా మరోసారి తన రివ్యూ సత్తా ఏంటో చూపించాడు మిస్టర్ కూల్.
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వినగానే మిస్టర్ కూల్.. ది ఫినిషర్.. జార్ఖండ్ డైనమెట్ లతో పాటుగా 2011 వరల్డ్ కప్ ఫైనల్లో కొట్టిన సిక్సే గుర్తుకు వస్తాయి. ఇక వీటన్నింటితో పాటుగా మరో లక్షణం కూడా ధోని అమ్ముల పొదిలో ఉంది. అదే నిశీత దృష్టి.. అవును ధోని ఒక్కసారి రివ్యూ తీసుకుంటే అందులో తిరుగుండదు అని మనందరికి తెలిసిన విషయమే. అదీకాక ధోని రివ్యూ తీసుకున్నాడు అంటే అంపైర్లకు సైతం కళ్లు బైర్లు కమ్ముతాయి. అందుకే అభిమానులు ముద్దుగా DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్ అంటూంటారు. తాజాగా మరోసారి తన రివ్యూ సత్తా ఏంటో చూపించాడు మిస్టర్ కూల్. తాజాగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో అంపైర్ వైడ్ ఇచ్చిన బాల్ కు రివ్యూ తీసుకుని డేంజరస్ బ్యాటర్ సూర్యకుమార్ ను పెవిలియన్ కు పంపాడు.
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా శనివారం ముంబై వర్సెస్ చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై బౌలర్లు విజృంభించడంతో.. ముంబై జట్టు వెంట వెంటనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు ముంబై టీమ్ కు చుక్కలు చూపించింది. దాంతో ముంబై జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ.. పీకల్లోతు కష్టాల్లో పడింది. జట్టులో రోహిత్ శర్మ (21), ఇషాన్ కిషన్ (32), గ్రీన్ (12), తిలక్ వర్మ (22) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. ఇక ఈ మ్యాచ్ లో ఎలాగైనా రాణించాలి అనుకున్న ముంబై స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ను అద్భుతమైన DRS తో అవుట్ చేశాడు ధోని. ఇషాన్ కిషన్ అవుట్ అయిన అనంతరం క్రీజ్ లోకి వచ్చాడు సూర్య కుమార్.
ఈ క్రమంలోనే బౌలింగ్ కి దిగాడు స్పిన్నర్ సాంట్నర్. ఎనిమిదో ఒవర్ 2వ బంతిని స్వీప్ షాట్ ఆడబోయాడు సూర్య. అయితే ఆ షాట్ కాస్తా మిస్ అయ్యింది. బాల్ వైడ్ అనుకుని అంపైర్ వైడ్ గా ప్రకటించాడు. కానీ క్యాచ్ పట్టిన ధోని మాత్రం ఎంతో కాన్ఫిడెంట్ గా అంపైర్ వైడ్ ఇవ్వగానే క్షణం అలోచించకుండా రివ్యూ కోరాడు. దాంతో రిప్లేలో చూడగా.. అది సూర్య గ్లౌవ్స్ కు తగిలినట్లు డీఆర్ఎస్ లో తేలింది. దాంతో అంపైర్ తప్పు ఒప్పుకుని అవుట్ ఇచ్చాడు. అయితే ఈ బాల్ చూసిన వారు ఎవరైనా నిజంగా వైడ్ అనుకుంటారు. కానీ ధోనికి మాత్రమే అది అవుట్ అని తెలిసింది. దాంతో మరోసారి తన రివ్యూ సిస్టం అంటే ఏంటో నిరూపించాడు. అందుకే అంటారు కాబోలు DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్ అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ధోని రివ్యూ సిస్టమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
SKY gone too !!!!
DRS = Dhoni Review System #MIvCSK pic.twitter.com/3ts65QjG4y
— flick (@onlykohly) April 8, 2023