ఒక టీం ప్లే ఆఫ్ కి చేరిందంటే టీం తో పాటు అభిమానులు, ఫ్రాంచైజీలు పండగ చేసుకుంటారు. కానీ ధోని నాయకత్వంలో చెన్నై జట్టుని చూస్తుంటే..ప్లే ఆఫ్ కి వెళ్లడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఇప్పటివరకు జట్టుకి కూడా సాధ్యం కాని 12 సార్లు ప్లే ఆఫ్ కి వెళ్లి రికార్డ్ సృష్టించింది. ఈ నేపథ్యంలో గెలుపు రహస్యమేమిటో ధోని చెప్పేసాడు.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జైత్ర యాత్ర కొనసాగుతుంది. ఇందులో భాగంగా.. నిన్న జరిగిన చివరి లీగ్ మ్యాచులో భారీ విజయాన్ని సొంతం చేసుకోని ప్లే ఆఫ్ బెర్త్ తో పాటుగా .. టాప్ 2 లో స్థానం సంపాదించింది. ఈ నెల 24న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ తో సూపర్ కింగ్స్ క్వాలిఫైయర్ 1 ఆడేందుకు సిద్ధమైంది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని భావిస్తున్న తరుణంలో అభిమానులు ఎలాగైనా ఈ ట్రోఫీ చెన్నైకే రావాలని ఆశించారు. దానికి తగ్గట్లే అందరి అంచనాలు అందుకుంటూ ధోని సేన ప్లే ఆఫ్ కి దూసుకెళ్లింది. అయితే చెన్నై జట్టుకి ప్లే ఆఫ్ కి వెళ్లడం కొత్తేమి కాదు. ఇప్పటివరకు 12 సార్లు ప్లే ఆఫ్ కి వెళ్లి రికార్డ్ సృష్టించింది. ఈ నేపథ్యంలో గెలుపు రహస్యమేమిటో ధోని చెప్పేసాడు.
ఒక టీం ప్లే ఆఫ్ కి చేరిందంటే టీం తో పాటు అభిమానులు, ఫ్రాంచైజీలు పండగ చేసుకుంటారు. కానీ ధోని నాయకత్వంలో చెన్నై జట్టుని చూస్తుంటే..ప్లే ఆఫ్ కి వెళ్లడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఐపీఎల్ లో చెన్నై ప్రస్తానం చూసుకుంటే ఇప్పటివరకు 14 సీజన్ లు ఆడింది. మధ్యలో రెండేళ్లపాటు ఈ జట్టుపై నిషేధం విధించారు. ఇక 14 సీజన్ లో ఏ జట్టుకి కూడా సాధ్యం కానీ రీతిలో రికార్డు స్థాయిలో 12 సార్లు ప్లే ఆఫ్ కి అర్హత సాధించి ఔరా అనిపించింది. ఐపీఎల్ లో చెన్నై ఆధిపత్యం ఏంటో ఈ గణాంకాలు చూస్తే అర్ధం అవుతుంది. ధోని నాయకత్వంలో ఇలాంటి విజయాలు సాధించడం సహజంగా మనం చూసిన మరీ 14 సీజన్ లో 12 సార్లు ప్లే ఆఫ్ అంటే ఏ కెప్టెన్ కైనా సవాలే. కానీ మహేంద్రుడు చేసి చూపించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ మీద విజయంతో ఫుల్ జోష్ లో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ నేపథ్యంలో ఇన్ని సార్లు ప్లే ఆఫ్ కి సాధించడంలో విజయ రహస్యం ఏమిటి అని అడగగా.. ధోని ఈ విధంగా చెప్పుకొచ్చాడు.” ప్రత్యేకంగా విజయ రహస్యం అంటూ ఏమీ ఉండదు. అందుబాటులో ఉన్న అత్యున్నత ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని వారికి అవకాశాలు ఇవ్వాలి. అంతే కాదు ప్లేయర్లతో పాటు.. సిబ్బందిని కూడా మనం గుర్తించాలి. వారికీ సరైన గుర్తింపు ఇవ్వాలి. తుషార దేశ్ పాండే, పతిరానా విషయంలో మేము అదే చేసాము. వాళ్ళు చాలా ఆత్మవిస్వాసంతో ఉన్నారు”. అని ధోని తెలియజేశాడు. దీంతో ఇప్పుడు ధోని మీద అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ధోని చేసిన ఈ వ్యాఖ్యలు మీకేవిధముగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.