సాధారణంగా జట్టు విజయాలు సాధిస్తున్నప్పుడు తుది జట్టులో లేని ఆటగాడి గురించి పెద్దగా చర్చించదు. కానీ ధోని మాత్రం అందరికంటే భిన్నం అని అందరికీ తెలిసిందే. బౌలర్లు అంతా బాగా రాణించిన నిన్న మ్యాచులో ధోని ఒక బౌలర్ గురించి పొగుడుతూ మాట్లాడడం విశేషం. మరి ధోనికి నచ్చిన ఆ బౌలర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో బ్యాటింగ్ లో కాస్త తడబడినా.. బౌలింగ్ లో మాత్రం సమిష్టిగా పోరాడి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్రస్తుతం 15 పాయింట్లతో మరో రెండు మ్యాచులుండగానే దాదాపు ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ప్రస్తుతం 12 మ్యాచులు ఆడిన సూపర్ కింగ్స్ మరో మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్ కి వెళ్తుంది. ఇదిలా ఉండగా.. బౌలర్లు అంతా బాగా రాణించిన నిన్న మ్యాచులో ధోని ఒక బౌలర్ గురించి పొగుడుతూ మాట్లాడడం విశేషం. మరి ధోనికి నచ్చిన ఆ బౌలర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన సంగతి తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో ఢిల్లీ 27 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై అందరూ తలో చేయి వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను 167 పరుగులు చేసింది. జట్టులో ఎవ్వరూ కూడా 25 పరుగులకంటే ఎక్కువ పరుగులు చేయకపోవడం విశేషం. ఇక ఒక మాదిరి లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ 140 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ ఆధ్యంతం చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఏ దశలో పోరాటాన్ని చూపించలేకపోయింది.
ఇక మ్యాచ్ గెలుపు అనంతరం ధోని మాట్లాడుతూ సాంట్నర్ గురించి చెప్పుకొచ్చాడు. “ఈ మ్యాచ్ సెకండ్ హాఫ్ లో పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. మా జట్టులో వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. ఈ వికెట్ పై వారు అద్భుతంగా బంతిని టర్న్ చేయగలరు. ఇలాంటి పిచ్ మేము సాధించిన స్కోర్ డిఫెండ్ చేసుకోగలమని భావించాం. ఇక వికెట్ల గురించి మాత్రమే ఆలోచించ వద్దని.. డాట్ బాల్స్ మీదే దృష్టి పెట్టమని చెప్పాను. ఇలాంటి ఫ్లాట్ వికెట్ పై మిచెల్ సాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అతడిని మేము చాలా మిస్ అవుతున్నాం. మా జట్టులో ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు ఉండడంతో సాంట్నర్ కి అవకాశం దక్కలేదు”. అని ధోని చెప్పుకొచ్చాడు. మరి మ్యాచ్ గెలిచినా ఇలా సాంట్నర్ ని తలుచుకోవడం ధోనికి మాత్రమే చెల్లింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.