లక్నోపై చెన్నై అద్భుత విజయం సాధించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదే మ్యాచ్ లో ఆడిన ధోనీ.. ఐపీఎల్ లోనే సరికొత్త రికార్డు సృష్టించాడనే విషయం మీకు తెలుసా?
హోమ్ గ్రౌండ్ లో చెన్నై గెలిచేసింది. తొలి మ్యాచ్ లో ఓడిపోయింది. కానీ లక్నోతో మ్యాచ్ లో గెలిచి.. ఈ సీజన్ లో బోణీ కొట్టేసింది. రుతురాజ్, కాన్వే అదిరిపోయే ఆరంభం ఇవ్వడం, ఆ తర్వాత బ్యాటర్లు తలో చేయి వేయడంతో.. 218 పరుగుల టార్గెట్ ని ప్రత్యర్థికి ఫిక్స్ చేసింది. కానీ 205 పరుగులు మాత్రమే చేసిన లక్నో ఓటమిపాలైంది. ఇక ఇదే మ్యాచ్ లో చివరి ఓవర్ లో బౌండరీలతో ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చిన ధోనీ.. ఐపీఎల్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఆ ఘనత సాధించిన రెండో బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. ఇంతకీ ఏంటా ఘనత?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి ఎందుకో ఐపీఎల్ లో ధోనీ పేరు మార్మోగిపోతుంది. రీసెంట్ గా అహ్మదాబాద్ లో సీజన్ తొలి మ్యాచ్ జరిగింది. ఇప్పుడు చెన్నైలోనూ మ్యాచ్ జరిగింది. ఈ రెండు చోట్ల ధోనీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. స్టేడియంలోని ప్రతి ఒక్కరూ ‘ధోనీ.. ధోనీ.. ధోనీ’ అంటూ చూస్తున్న వాళ్లందరికీ గూస్ బంప్స్ తెప్పించారు. అందుకు తగ్గట్లే తొలి మ్యాచ్ చివరి ఓవర్ లో 4,6 కొట్టిన.. లక్నోతో మ్యాచ్ లో 6,6 కొట్టి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో 5000 పరుగుల మార్క్ ని ధోనీ దాటేశాడు. చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ లో ఇప్పటివరకు 5000 పరుగుల మార్క్ ని పలువురు బ్యాటర్లు దాటారు. కానీ తక్కువ బంతుల్లో దీన్ని అందుకున్న వారిలో ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. 3692 బంతుల్లో ధోనీ ఈ ఘనత సాధించగా.. ఇతడి కంటే ముందు చెన్నై సూపర్ కింగ్స్ కే ఆడిన సురేష్ రైనా 3619 బంతుల్లో 5000 పరుగుల మార్క్ ని అందుకోవడం విశేషం. ఇలా ఇద్దరు చెన్నై బ్యాటర్లు ఐపీఎల్ లో చరిత్ర సృష్టించడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా మూడు, నాలుగు స్థానాల్లో వరసగా రోహిత్ శర్మ-3817 బంతులు, కోహ్లీ-3827 బంతులతో ఉన్నారు. సరే ఇదంతా పక్కనబెడితే.. మ్యాచ్ గెలిచి, బ్యాటర్ గా ధోనీ రికార్డు సృష్టించడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
DHONI IS THE GOAT. pic.twitter.com/RO67eIfaZe
— Johns. (@CricCrazyJohns) April 3, 2023