ధోనీ చివరి బంతికి సిక్స్ కొట్టలేదని చాలామంది బాధపడుతున్నారు. మరికొందరు విమర్శిస్తున్నారు. కానీ వాళ్లందరూ ఈ స్టోరీ చదివితో ఓ విషయం తెలుసుకుంటారు. ధోనీ నిజంగా గ్రేట్ అని ఒప్పుకొంటారు!
మీకు ధోనీపై ఇష్టం, కోపం.. ఏది ఉన్నాసరే ఈ స్టోరీని అస్సలు మిస్ కావొద్దు. ఎందుకంటే ఇది మీకోసమే. రాజస్థాన్ జట్టుతో తాజాగా జరిగిన మ్యాచ్ లో చెన్నై గెలవాలంటే చివరి బంతికి ఐదు రన్స్ కొట్టాలి. టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరూ టెన్షన్ తో చచ్చిపోతారా అనిపించింది. ధోనీ సిక్స్ కొట్టేస్తాడు, మ్యాచ్ గెలిపిస్తాడు అని ఆల్మోస్ట్ ఫిక్సయిపోయారు. కానీ అలా జరగలేదు. సింపుల్ గా సింగిల్ రన్ తీసి వదిలిపెట్టాడు. దీంతో రాజస్థాన్ జట్టు 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా ధోనీ సరిగా ఆడలేదు, సిక్స్ కొట్టలేదు అని పలువురు విమర్శిస్తున్నారు. వాళ్లందరూ ధోనీని తిట్టడంలో తప్పు లేదు. కానీ మీరు ఓ విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మీ ఫేవరెట్ హీరో వరసగా సినిమాలు తీస్తుంటాడు. అన్నింటితోనూ సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ కొడతాడా అంటే డౌటే అంటారు. అలానే ఓ స్టార్ క్రికెటర్, ఫినిషర్ అన్నంత మాత్రాన ప్రతి మ్యాచ్ లోనూ సిక్స్ కొట్టి గెలిపించడం కుదరకపోవచ్చు. రాజస్థాన్ తో మ్యాచ్ లోనూ అలానే జరిగింది. అందరూ ధోనీ సిక్స్ కొట్టలేదు, సిక్స్ కొట్టలేదు అంటున్నారు. ధోనీ వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇలాంటి టైంలో ధోనీ ఫిట్ ఉండటం, ఆడటమే గ్రేట్. అలాంటిది ఇప్పుడు కూడా కుర్ర క్రికెటర్లలా మ్యాచ్ లు గెలిపించేయాలి అంటే అన్నిసార్లు కుదరకపోవచ్చు. అంతమాత్రాన తిట్టాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు.
ఎందుకంటే రాజస్థాన్ తో మ్యాచ్ లో చెన్నై చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. టాపార్డర్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. అదే టైంలో ప్రత్యర్థి జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో సాధించాల్సిన రన్ రేట్ చాలా పెరిగిపోయింది. చివరి 3 ఓవర్లలో 54 పరుగులు కొట్టాలి. దాదాపు చెన్నై ఓడిపోయిందని అందరూ ఫిక్సయిపోయారు. ఇలాంటి టైంలో ధోనీ-జడేజా తమ అనుభవాన్ని బయటకు తీశారు. వికెట్ పడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, దాదాపు గెలిపించినంత పనిచేశారు. ఇదంతా చూసిన మనం చెన్నై సూపర్ కింగ్స్ ని, కెప్టెన్ ధోనీని కచ్చితంగా మెచ్చుకుని తీరాలి. ఇప్పటికీ చెన్నై జట్టుని గెలుపోటములతో సంబంధం లేకుండా ముందుండి నడిపిస్తున్నాడంటే ధోనీ నిజంగా గ్రేట్. మరి దీనిపై మీరేం అంటారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
MS DHONI, GREATEST EVER 🔥pic.twitter.com/JxR6GObpiZ
— Johns. (@CricCrazyJohns) April 12, 2023