మిస్టర్ కూల్ ధోనీ అంపైర్లతో గొడవపడ్డాడు. ఓ రూల్ విషయమై పంతం నెగ్గించుకున్నాడు. దీంతో నెటిజన్స్ తలో రకంగా మాట్లాడుకుంటున్నారు? ఇంతకీ ఏంటి సంగతి?
మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెప్పగానే మిస్టర్ కూల్ అనే పదం గుర్తొస్తుంది. మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాసరే చాలా కూల్ గా ఉంటాడు. గెలిచినా ఓడినా సరే పెద్దగా తన భావోద్వేగాన్ని బయటపెట్టాడు. ఇదే ధోనీకి అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది. టీమిండియా తరఫున ఏమో గానీ ఐపీఎల్ లో చెన్నై మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు పలుమార్లు ఏకంగా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా గుజరాత్ తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ లో ధోనీ ఏకంగా అంపైర్లతో గొడవపడ్డాడు. అది కూడా ఓ రూల్ కోసం? దీంతో సోషల్ మీడియా మొత్తం అసలేం జరిగిందా? అని తెగ ఆరా తీస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. చెపాక్ లో చెన్నై గెలిచేసింది. క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ ని ఓడించి, 10వ సారి ఫైనల్లో అడుగుపెట్టింది. టాస్ ఓడిన సీఎస్కే తొలుత బ్యాటింగ్ చేసి 172/7 స్కోరు చేయడంతో గెలవడం కష్టమే అనుకున్నారు. కానీ ధోనీ అనుభవం ముందు గుజరాత్ తేలిపోయింది. ఛేదనలో గుజరాత్ దూకుడుగానే బ్యాటింగ్ చేసినప్పటికీ.. చెన్నై బౌలర్లు వరస విరామాల్లో వికెట్లు తీయడంతో 157 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. చెన్నై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో పతిరానా బౌలింగ్ టైంలో ధోనీ అంపైర్లతో గొడవపడ్డాడు.
గుజరాత్ జట్టు 24 బంతుల్లో 71 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. పతిరానాకు మూడు ఓవర్లు మిగిలి ఉన్నాయి. దీంతో 16వ ఓవర్ వేసేందుకు క్రీజులోకి వచ్చాడు. కానీ అంపైర్లు అడ్డుకున్నారు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం బౌలింగ్ వేయడానికి ముందు సదరు బౌలర్.. మైదానంలో 9 నిమిషాలు కచ్చితంగా ఉండాలి. పతిరానా మాత్రం నేరుగా డగౌట్ నుంచి వచ్చి బౌలింగ్ చేసేందుకు రెడీ అయిపోయాడు. మనోడి బౌలింగ్ ఆ టైంలో ఎంత ముఖ్యమో ధోనీకి తెలుసు. అందుకే అంపైర్లతో వాదించి మరీ అతడితోనే బౌలింగ్ చేయించాడు. ధోనీ నుంచి ఇది ఎక్స్ పెక్ట్ చేయని నెటిజన్స్ అవాక్కవుతున్నారు. తమ జట్టుని గెలిపించడ కోసం ధోనీ కాదు ఎవరైనా ఇలానే చేస్తారని మరికొందరు నెటిజన్స్ అంటున్నారు. మరి ఈ వాగ్వాదంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Pathirana was out of the field for more than 9 minutes and came suddenly to bowl. Here the rule is that Pathirana should present atleast 9 minutes on the field to bowl his over but what Dhoni was chatting with umpires??
This isn’t acceptable at all. pic.twitter.com/NML3LikBc3— Priyansh (@priyansh_45) May 23, 2023
MS Dhoni Intentionally wasted time so that pathirana can bowl even though being off the field for certain period of time..
No wonder why they were banned 🚫#CSKvsGT pic.twitter.com/2pkzAnA42a
— Cric8ly 🏏 (@MR_Alpha_21) May 23, 2023