MS Dhoni: రెండు బంతులను ధోని అద్భుతంగా భారీ సిక్సులు బాదాడు. సమీకరణం 3 బంతుల్లో 7 పరుగులుగా మారింది. ఈ దశలో ధోని, జడేజా క్రీజ్‌లో ఉండడంతో.. చెన్నై విజయం నల్లేరు మీద నడకే అని భావించారు. కానీ..
ఐపీఎల్‌లో రోజుకొక థ్రిల్లర్ జరుగుతోంది. మ్యాచ్ ఫలితం కోసం క్రికెట్ ప్రేమికులు చివరి బంతి వరకు వేచి చూడాల్సి వస్తుంది. ఆదివారం రింకూ కొట్టిన సిక్సర్లు.. ఆ తర్వాత రోజు హర్షల్ పటేల్ మన్కడింగ్ చేయడంలో విఫలమవడం.. మొన్నటి మ్యాచ్ లో నోకియా చివరి ఓవర్లో విసిరిన యార్కర్లు అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చాయి. ఇక వీటికి మించి అన్నట్లుగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చెన్నైకి ఓటమి ఖాయమన్న దశలో ధోని, జడేజా అద్భుత బ్యాటింగ్ తో మ్యాచ్ చెన్నై వైపుకి లాగారు. కానీ సందీప్ శర్మ ఒత్తిడిని తట్టుకొని చివరి మూడు బంతులకి సింగిల్స్ ఇవ్వడంతో రాజస్థాన్ విజయం సాధించింది. అయితే ఓడినా ఈ మ్యాచులో మాకు హ్యాపీయే అంటున్నాడు ధోని. మరి ధోని ఇలా ఎందుకన్నాడు? ఏ విషయంలో హ్యాపీనో ఇప్పుడు చూద్దాం.
చెన్నై గెలవాలంటే చివరి ఓవర్లో 21 పరుగులు చేయాలి. ఒత్తిడిలో తొలుత రెండు వైడ్లు వేసిన సందీప్.. ఒక బంతి డాట్ వేశాడు. తర్వాత రెండు బంతులను ధోని అద్భుతంగా భారీ సిక్సులు బాదాడు. సమీకరణం 3 బంతుల్లో 7 పరుగులుగా మారింది. ఈ దశలో ధోని, జడేజా క్రీజ్‌లో ఉండడంతో.. చెన్నై విజయం నల్లేరు మీద నడకే అని భావించారు. 4, 5 బంతులకు సింగిల్స్ రావడంతో చివరి బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. ఇక చెన్నై గెలవాలంటే చివరి బంతికి ధోని సిక్సర్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ సందీప్ శర్మ అద్భుతంగా యార్కర్ సంధించడంతో కేవలం సింగల్ మాత్రమే వచ్చింది. దీంతో 3 పరుగుల తేడాతో చెన్నై పరాజయం పాలైంది. ఇదిలా ఉండగా.. ఈ ఓటమిపై ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
ధోని మాట్లాడుతూ” మిడిల్ ఓవర్లలో మాకు అనుకున్న పరుగులు రాలేదు. పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగానే ఉంది. కానీ రాజస్థాన్ జట్టులో అశ్విన్, చాహల్ లాంటి స్పిన్నర్లు ఉన్నారు. నేను , జడేజా చివరి ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ చేయాలనుకున్నాం. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు అవసరమైన దశలో జడేజా సిక్సర్ తో మ్యాచ్ ఫినిష్ చేస్తాడని భావించా. కానీ అతడు నాకే ఫినిషింగ్ ఛాన్స్ ఇచ్చాడు.నేను స్ట్రెయిట్ సిక్స్ కొడదామనుకున్నా. కానీ సందీప్ శర్మ బాగా బౌలింగ్ చేసి నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్ ఓడినా చివరి వరకు మేము గెలుపు కోసం ప్రయత్నించాము. అది మాకు సంతృప్తినిచ్చింది. 3 పరుగుల తేడాతో ఓడినా.. నెట్ రన్ రేట్ మాకు కలిసి వస్తుంది”. అని చెప్పుకొచ్చాడు.
Playing this type of innings at the age of 41 , huge respect to MS Dhoni 🙇 @ChennaiIPLpic.twitter.com/HG3EkUydda
— Jayprakash MSDian™ 🥳🦁 (@ms_dhoni_077) April 13, 2023