ధోని గురించి ఎప్పుడూ కాస్త విమర్శించే గంభీర్.. తాజాగా లక్నో తో జరిగిన మ్యాచ్ లో ధోని కొట్టిన సిక్సులకి షాక్ లోకి వెళ్ళినట్లే అనిపిస్తుంది. ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా ధోనికి ఎంతమంది అభిమానులున్నారో తెలిసిందే. కెప్టెన్సీ, ఫినిషింగ్, వికెట్ కీపింగ్ ఇలా.. పాత్ర ఏదైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని మహేంద్రుడికి పేరుంది. అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్లో ఇప్పటికే ఈ విషయం చాలా సార్లు రుజువైంది. ఎప్పుడు పాజిటివ్ గా ఉండే మిస్టర్ కూల్ గురించి అందరూ మంచిగానే మాట్లాడతారు. దేశాన్ని గర్వపడేలా చేసిన ధోనిని విమర్శించడానికి పెద్దగా కారణాలు దొరకవు. కానీ భారత మాజీ ఓపెనర్ గంభీర్ కి మాత్రం ధోని ఏం చేసినా నచ్చదు అనేలా తన వ్యవహార శైలి ఉంటుంది. ధోని గురించి ఎప్పుడూ కాస్త విమర్శించే గంభీర్.. నిన్న మ్యాచ్ లో ధోని కొట్టిన సిక్సులకి షాక్ లోకి వెళ్ళినట్లే అనిపిస్తుంది. ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోని సిక్స్ తో మ్యాచ్ ముగించిన సంగతి తెలిసిందే. శ్రీలంకపై వాంఖడేలో జరిగిన ఈ ఫైనల్లో ధోని ఆడిన ఈ ఇన్నింగ్స్ అభిమానులకి ఎప్పటికీ ప్రత్యేకమే. టీమిండియా వరల్డ్ కప్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ధోని ఆడిన ఈ ఇన్నింగ్స్ గురించే అందరూ చర్చించుకుంటారు. కానీ ఇదే విషయమై గంభీర్ మాట్లాడుతూ.. వరల్డ్ గెలవడం అందరి సమిష్టి కృషి. ఈ విషయంలో ధోనికి మాత్రమే క్రెడిట్ ఇవ్వడం సరికాదని చెప్తుంటాడు. అంతే కాదు ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు సిరీస్ లో కూడా ధోని ఫినిష్ చేయడాన్ని సైతం గంభీర్ విమర్శించాడు. ఎందుకు మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్తాడు అని అసంతృప్తి వ్యక్తం చేసాడు. ఇక ఈ మధ్యే ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్ ఎవరనే ప్రశ్న ఎదురవగా ఠక్కున రోహిత్ శర్మ పేరు చెప్పేసాడు. ఈ కామెంట్లు నిజమో కాదో పక్కన పెడితే.. ప్రస్తుతం ధోని ఫ్యాన్స్ మాత్రం గంభీర్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుంది.
నిన్న లక్నో సూపర్ జయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇన్నింగ్స్ లో మార్క్ వుడ్ చివరి ఓవర్ వేయడానికి వచ్చాడు. తొలి బంతికే జడేజా అవుట్ కాగా.. నంబర్ 8లో కెప్టెన్ ధోని బ్యాటింగ్ కి వచ్చాడు. ఈ సమయంలో అభిమానులు ధోని.. ధోని అని నినాదాలు చేయడం మొదలు పెట్టారు. చివర్లో ధోని బ్యాటింగ్ చూద్దాం అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకి ధోని మంచి కిక్ ఇచ్చాడు. తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి తనలో ఇంకా సత్తా ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు. థర్డ్ మ్యాన్ దిశగా ఒక సిక్స్, ఆ తర్వాత పవర్ ఫుల్ పుల్ షాట్ ఆడి మిడ్ వికెట్ పైనుంచి మరొక సిక్సర్ కొట్టి అభిమానుల్లో జోష్ నింపాడు. ఈ సమయంలో గంభీర్ ఫేస్ మాడిపోయినట్లు కనిపించింది. ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేదు. అలా చూస్తూ ఉండిపోయాడు. లక్నో టీమ్‌కి మెంటార్ గా ఉన్న గంభీర్.. ధోని సిక్సులు కొడుతుంటే డగౌట్ లో ఏం చేయలేక డీలా పడిపోయినట్లు కనిపించాడు. గంభీర్ ఇచ్చిన ఈ రియాక్షన్ కి ఇప్పుడు నెట్టింట్లో మీమ్స్, ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. తనను విమర్శించిన వారికి ధోని బ్యాట్ తోనే సమాధానం చెప్పాడని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
ధోనీ కొడుతుంటే గంభీర్ మండింది | Gambhir reactions on Dhoni batting vs Lucknow #shorts #ytshorts #shortsfeed #viralshorts #GautamGambhir #MSDhoni #Dhoni #Dhoni07 #dhonifan #dhonifanforever #mahendrasinghdhoni #dhonivsgambhir #dhonivslucknowsupergiants #dhonivslucknow #csk pic.twitter.com/S8Havpzpxb
— Deccan 24×7 (@Deccan24x7) April 4, 2023