భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కానుందా ? ధోని వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. రిటైర్మెంట్ విషయంలో హింట్ ఇచ్చిన ధోని.. ఏం మాట్లాడంటే ?
చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఎప్పుడు ? గత కొంత కాలంగా ఈ విషయం గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ధోని రిటైర్మెంట్ గురించి ఇప్పటికే పలు క్రికెటర్లు తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటివరకు ధోని క్రికెట్ కి ఎప్పుడు వీడ్కోలు పలుకుతాడనే విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మిస్టర్ కూల్ రిటైర్మెంట్ విషయంలో ఎప్పటికప్పుడు సస్పెన్స్ అలానే కొనసాగుతుంది. అయితే తాజాగా ధోని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. త్వరలోనే తాను క్రికెట్ కి గుడ్ బై చెబుతున్నాడనే హింట్ ఇచ్చేసాడు. దీని ప్రకారం ధోని చివరి ఐపీఎల్ సీజన్ ఇదేనా ?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోని కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో ఒకటి రెండు సీజన్లు మినహాయించి దాదాపు ప్రతి సీజన్ లో చెన్నై జట్టుని ప్లే ఆఫ్ చేర్చిన ఘనత ధోని సొంతం. 41 ఏళ్ళు వయసు కలిగిన ధోని క్రికెట్ లో కొనసాగడం కష్టంగానే కనిపిస్తుంది. ఫిట్ గా ఉన్నప్పటికీ వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా, కెప్టెన్ గా ధోని మీద చాలా ఒత్తిడి ఉంటుంది. అందుకేనేమో ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నాడు. ప్రస్తుత సీజన్ లో ధోని చెన్నై కి వరుస విజయాలను అందిస్తున్నాడు. నిన్న సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై 7 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ధోని తన రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు.
“నేను నా కెరీర్ చివరి దశలో ఉన్నాను. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే ప్రతి మ్యాచ్ ఆస్వాదించాలనుకుంటున్నాను. నాకు చెన్నై తో విడదీయరాని బంధం ఉంది. వారి ప్రేమను నేను ఎప్పటికి మర్చిపోలేను. ఇక ఈ సీజన్లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు. కానీ మ్యాచులు గెలుస్తున్నందుకు ఆనదంగా ఉంది. ఫాస్ట్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. వాళ్లకు ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా పతిరానా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అని ఈ శ్రీలంక యార్కర్ల వీరుడిని ప్రశంసించాడు. ఇక ఈ సందర్భంగా క్యాచ్ విషయం గురించి మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో నేను మంచి క్యాచ్ అందుకున్నాను. అయినా కూడా నాకు అవార్డు రాలేదు” అని ధోని సరదాగా వ్యాఖ్యానించాడు. మరి ధోని వ్యాఖ్యలు చూస్తుంటే ఎక్కువకాలం ఐపీఎల్ లో కొనసాగేలా కనిపించడం లేదు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.