చెన్నై మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు. చివరి ఓవర్ లో సందీప్ శర్మ బాగా బౌలింగ్ చేసి రాజస్థాన్ విజయానికి కారణమై ఉండొచ్చు. కానీ ధోనీనే ఎక్కువగా హైలెట్ అయ్యాడు. దీనికి రీజన్ ఏంటో తెలుసా?
ఈసారి ఐపీఎల్ స్టార్ట్ కావడానికి ముందు అసలు బజ్ లేదు. క్రికెట్ లవర్స్ అయితే హా ఓకే ఓకేలే, ఏదైతే అది అయింది చూద్దాం అన్నట్లు ఒక్కో మ్యాచ్ చూస్తూ వచ్చారు. తొలుత ఓ వారం పాటు చప్పగానే సాగిన మ్యాచులు.. ఈ ఆదివారం నుంచి ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాయి. థ్రిల్లర్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా వరస సాగుతున్నాయి. తాజాగా చెన్నై-రాజస్థాన్ మ్యాచ్ నే తీసుకోండి. సీఎస్కే గెలుస్తుందని ఓ దశలో అందరూ ఆల్మోస్ట్ ఫిక్సయిపోయారు. అలాంటి స్థితి నుంచి దాదాపు గెలిపించినంత పనిచేశాడు ధోనీ. కానీ అది జరగలేదు. అయితే ఇక్కడ బౌలర్ సందీప్ శర్మ కంటే ధోనీనే ఎక్కువ హైలెట్ అయ్యాడు.
ఇక విషయానికొస్తే.. మహేంద్ర సింగ్ ధోనీ పేరు అనేది క్రికెట్ లో ఓ బ్రాండ్ అయిపోయింది. ఓ సాధారణ వికెట్ కీపర్ గా మొదలైన అతడి జర్నీ.. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ గా, ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ రేంజ్ వరకు వెళ్లింది. 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేసరికి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఇది జరిగి నాలుగేళ్లు అవుతోంది. భారత జట్టు తరఫున ఆడకపోతే ఏంటి.. ఐపీఎల్ ఉంది. ప్రతి సీజన్ లోనూ ధోనీని చూడొచ్చులే అని ఫ్యాన్స్ అనుకున్నారు. అందుకు తగ్గట్లే ప్రతి సీజన్ లోనూ ధోనీ కోసమే అన్నట్లు మ్యాచ్ లు చూస్తున్నారు. ఈసారి కూడా ధోనీ బ్యాటింగ్ కోసమే ఐపీఎల్ చూస్తున్నవాళ్లు చాలామందే ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
తాజాగా రాజస్థాన్ తో చెన్నై ఆడిన మ్యాచ్ నే తీసుకుంటే.. ధోనీ 17 బంతుల్లో 32 రన్స్ కొట్టాడు. సాధారణంగా ఐపీఎల్ లో ఇది పెద్ద విషయమేమి కాదు. అక్కడున్నది ధోనీ కావడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దాదాపు మ్యాచ్ గెలిపించినంత పనిచేసిన ధోనీ.. చివరి ఓవర్లలో సిక్సులతో వావ్ అనిపించాడు. కానీ చివరి బంతికి 5 పరుగులు అవసరమైన స్థితిలో యార్కర్ తో ధోనీని బోల్తా కొట్టించిన సందీప్ శర్మ.. రాజస్థాన్ విజయానికి కారణమయ్యాడు. కానీ ధోనీ బ్యాటింగ్ ముందు సందీప్ శర్మని దాదాపు చాలామంది పట్టించుకోవడం లేదు. ఈ బౌలర్ మాత్రమే కాదు.. ధోనీ కరెక్ట్ గా బ్యాటింగ్ చేయాలే గానీ అవతల ఎండ్ లో బౌలర్ ఎవరున్నా సరే గుర్తుండదు. అంతెందుకు ధోనీ.. 2011 వన్డే వరల్డ్ కప్ ని సిక్స్ కొట్టి గెలిపించాడని చాలామందికి తెలుసు. కానీ ఆ బాల్ వేసిన బౌలర్ పేరు మీలో ఎంతమందికి గుర్తుంది చెప్పండి. ఒకవేళ తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి.
Appreciation post for Sandeep Sharma. With the final ball to go, he was on his own at the top of his mark. He wasn’t bowling just to MS Dhoni, but also to a packed Chepauk. And he just held his nerve & stuck to the plan. The man at the other end would’ve been proud. #CSKvsRR pic.twitter.com/t24rUGAc6a
— Srinjoy Sanyal (@srinjoysanyal07) April 12, 2023