ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభం అయినప్పటినుంచి ఫ్యాన్స్ ధోని మీద అంతులేని అభిమానం చూపిస్తున్నారు. ఒకప్పుడు చెన్నైలో మాత్రమే ఇలాంటి సంఘటనలు చుసిన మనం ఇప్పుడు స్టేట్ ఏదైనా అక్కడ మహీ మానియా ఉండాల్సిందే. తాజాగా ధోని ఫీవర్ ఢిల్లీలో కూడా మొదలైంది.
ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మ”సర్కార్ వారి పాటలో సూపర్ స్టార్ మహేష్ చెప్పే డైలాగ్ ఇది. ఆ డైలాగ్ అక్షరాలా రియల్ లైఫ్ లో మహేంద్ర సింగ్ ధోని విషయంలో నిజం అవుతుంది. ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభం అయినప్పటినుంచి అభిమానులు ధోని మీద అంతులేని అభిమానం చూపిస్తున్నారు. స్టేడియం ఏదైనా అక్కడ ఎల్లో ఫీవర్ కొనసాగుతుంది. ఒకప్పుడు చెన్నైలో మాత్రమే ఇలాంటి సంఘటనలు చుసిన మనం ఇప్పుడు స్టేట్ ఏదైనా అక్కడ మహీ మానియా ఉండాల్సిందే. ఒకరిని మించి మరొకరు అభిమానం చూపిస్తూ.. మిస్టర్ కూల్ పై ఎక్కడ లేని ప్రేమను చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధోని ఫీవర్ ఢిల్లీలో కూడా మొదలైంది.
క్రికెట్ లో ఒక్కసారి స్టార్ డం అందుకుంటే మన దేశంలో అభిమానులు నెత్తిన పెట్టుకుంటారు అనే విషయం మరోసారి ప్రూవ్ అయింది. చెన్నై బెంగళూరు, జైపూర్, తాజాగా ఢిల్లీ ఇలా ఎక్కడపడితే అక్కడ మహీ ఫ్యాన్స్ దర్శనమిస్తున్నారు. ఇక వివరాల్లోకెళ్తే.. ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో తమ చివరి లీగ్ మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండగా.. స్టేడియం వెళ్లే దారులన్నీ అభిమానులతో నిండిపోయాయి. రోడ్లన్నీ ఎల్లో కలర్ తో నిండిపోవడం గమనార్హం.
అయితే.. దీనికి కారణం ఏంటి అని పరిశీలిస్తే.. బస్ లో ధోని ఉండడమే. ధోని బస్ లో వస్తున్నాడని తెలిసి అభిమానులందరూ బస్ ని చుట్టిముట్టారు. అంతే కాదు కార్ల మీద నిల్చొని ధోనికి చేతులూపుతూ తమ ప్రేమని చాటుకున్నారు. ధోనిని చూడడానికి చాలామంది రావడంతో ఒకదశలో బస్ కూడా కదలలేని పరిస్థితి. దీంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ ఆ తర్వాత బస్ కి దారిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. దీంతో చాలా మంది ఇప్పుడు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక మనిషికి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా అని ఒకరు ట్వీట్ చేస్తే.. ఢిల్లీలోని రోడ్లన్నీ జన సంచారంతో నిండిపోయాయని మరొకరు ట్వీట్ చేశారు. మొత్తానికి ధోని ఎక్కడకు వెళ్లినా అభిమానులు మేమున్నాం అంటూ తెలియజేస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Fans behind the CSK bus in Delhi.
This is madness. pic.twitter.com/P594b5r8QL
— Johns. (@CricCrazyJohns) May 20, 2023