ధోనీ ఫ్యాన్స్ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ అదే జరుగుంటే.. స్టేడియంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ గాయపడేవారు. అవును మీరు విన్నది నిజమే. ఇంతకీ ఏం జరిగింది?
ధోనీ.. ధోనీ.. ధోనీ.. ఇది చదివితే ఆ ఏముంది పేరుని మూడుసార్లు రాశావ్ గా అనేస్తారు. జస్ట్ అలా ఊహించుకోండి. ఇదే స్లోగన్ ని వేలాదిమంది ఫ్యాన్స్, స్టేడియంలో ఒకేసారి ఒకే రిథమ్ లో చెబితే ఎలా ఉంటుంది? గూస్ బంప్స్ వచ్చేస్తాయి కదా. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీరు ఎవరైనా కానీ నరాలు జివ్వుమంటాయి. క్రికెట్ ఫ్యాన్ అయినా, కాకపోయినా మీరు కూడా గట్టిగా అరిచి గోల గోల చేస్తారు. ఎందుకంటే అక్కడున్నది ధోనీ కాబట్టి. స్టేడియంలో ఉన్నది అతడి వీరాభిమానులు కాబట్టి. ఇప్పుడు వాళ్ల వల్లే ఓ పెద్ద ప్రమాదం తప్పింది. అవును మీరు విన్నది కరెక్టే. తాజాగా ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అసలు విషయానికొచ్చేస్తే.. ధోనీ ఓ పేరు కాదు ఆలోవర్ క్రికెట్ లోనే ఎప్పటికీ చెరిగిపోని బ్రాండ్. ఓ సాధారణ వికెట్ కీపర్ గా మొదలైన అతడి జర్నీ.. ఇప్పుడు కోట్లాదిమందికి ఆరాధ్య క్రికెటర్ అయ్యేలా చేసింది. టీమిండియాకు మూడు ఐసీసీ కప్పులు అందించాడనో.. కోహ్లీ-రోహిత్ శర్మ లాంటి తురుపు ముక్కల్ని స్టార్ క్రికెటర్లుగా తీర్చిదిద్దాడనే.. ఇలా వందల కారణాలుంటాయి ధోనీని మెచ్చుకోవడానికి. సరే అదంతా పక్కనబెడితే టీమిండియా నుంచి రిటైర్ అయిన తర్వాత ధోనీ ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పటివరకు జరిగినవన్నీ ఓ ఎత్తయితే.. ఈసారి మాత్రం ధోనీ డైహార్డ్ ఫ్యాన్స్ అతడిపై వేరే లెవల్ ప్రేమ చూపిస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా దిల్లీపై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 167/8 స్కోరు చేసింది. ఛేదనలో దిల్లీ బాగానే ఆడింది కానీ ఓవర్లన్నీ పూర్తిచేసి 140/8 మాత్రమే చేయగలిగింది. ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన తొలిజట్టుగా నిలిచింది. సరే ఇది పక్కనబెడితే చెన్నై ఈ సీజన్ లో 12 మ్యాచులాడింది. వీటిలో కొన్ని హోమ్ గ్రౌండ్ లో, మరికొన్ని ప్రత్యర్థి జట్ల గ్రౌండ్ లో జరిగాయి. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే.. గుజరాత్ ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇప్పుడు దిల్లీతో మ్యాచ్ వరకు ప్రతి స్టేడియంలోనూ ధోనీ ఫ్యాన్స్ హవా, పసుపు రంగు చెన్నై జట్టు జెండాలే కనిపిస్తూ వచ్చాయి. మిగతా మ్యాచ్ ల్లోనూ ఇదే రిపీట్ అవుతుంది. అందులో డౌటే లేదు.
అయితే తాజాగా దిల్లీతో మ్యాచ్ లో ధోనీ ఫ్యాన్స్ అరాచకానికి అసలు సిసలు డెఫినిషన్ చూపించారు. అవును మీరు విన్నది నిజమే. చెన్నై మ్యాచ్ అంటే చాలు అభిమానులు కోరుకునేది ఒక్కటే. ధోనీ బ్యాటింగ్ కి రావాలి. సిక్సులు కొట్టాలి. దిల్లీతో మ్యాచ్ లోనూ అదే జరిగింది. కానీ ధోనీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టడానే స్టేడియంలో ఫ్యాన్స్ అరుపులు గోలతో సౌండ్ దద్దరిల్లిపోయింది. ఆ విషయమే ఓ అభిమాని స్మార్ట్ వాచ్ గుర్తించింది. మరికాస్త సౌండ్ పెరిగితే చెవులు పోవడం గ్యారంటీ అని హెచ్చరించింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి. జస్ట్ ట్విట్టర్ లో వీడియో చూసిన మీ పరిస్థితే ఇలా ఉంటే.. ఒకవేళ స్టేడియంలో ఉంటే మీ చెవులు కూడా పోయిండేవేమో? మరి ధోనీ ఫ్యాన్స్ గోలపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
The Arrival of Ms Dhoni 💛🔥#ThalaDhoni #Dhoni #CSKvDC @msdhoni pic.twitter.com/DikvSbM0ua
— Jagadish MSDian 💛🇮🇳 (@Jagadishroyspr) May 10, 2023