రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని లాస్ట్ బాల్ ను సిక్సర్ గా మలచకపోవడానికి పెద్ద కారణమే ఉంది. అది తెలిస్తే.. ఇంత బాధను ధోని అనుభవిస్తున్నాడా? అని బాధపడతారు మీరు. మరి ధోని లాస్ట్ బాల్ ను సిక్స్ కొట్టకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహేంద్ర సింగ్ ధోని.. క్రీజ్ లో ఉంటే జట్టు గెలుస్తుందని గుండెల మీద హాయిగా చేయి వేసుకుని నిద్రపోవచ్చు. అయితే ప్రత్యర్థులకు మాత్రం గుండె దడ రావడం ఖాయం. మహీ క్రీజ్ లో ఉన్నడు అంటేనే బౌలర్లకు ఒక పక్క వణుకు మెుదలౌతుంది. అదీకాక వరల్డ్ క్లాస్ బెస్ట్ ఫినిషర్ గా ధోని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అయితే ఇంతటి క్రేజ్ ఉన్న ధోని.. తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం నిరాశ పరిచాడు. అప్పటికే మూడు సిక్సర్లు బాదినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. అయితే ధోని లాస్ట్ బాల్ ను సిక్సర్ గా మలచకపోవడానికి పెద్ద కారణమే ఉంది. అది తెలిస్తే.. ఇంత బాధను ధోని అనుభవిస్తున్నాడా? అని బాధపడతారు మీరు. మరి ధోని లాస్ట్ బాల్ ను సిక్స్ కొట్టకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ లో బెస్ట్ ఫినిషర్ ఎవరు? అంటే ఠక్కున గుర్తుకువచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని. 42 సంవత్సరాలు వయసులోనూ తనలో బ్యాటింగ్ పవర్ ఇంకా తగ్గలేదు అని నిరూపిస్తూనే ఉన్నాడు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2023లో సైతం తన ఫినిషర్ రోల్ ను అద్భుతంగా నిర్వర్తిస్తున్నాడు ధోని. ఇక ధోని చివరి వరకు క్రీజ్ లో ఉన్నడు అంటే జట్టు విజయం ఖాయం అని అనుకుంటారు అభిమానులు. వారి అంచనాలకు తగ్గట్లుగానే ధోని కూడా అలాగే మ్యాచ్ ను ఫినిష్ చేస్తుంటాడు. అయితే రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం తన ఫినిషర్ రోల్ కు సంపూర్తిగా న్యాయం చేయలేకపోయాడు ధోని. లాస్ట్ బాల్ ను సిక్స్ కొట్టలేక.. జట్టు ఓటమికి కారణం అయ్యాడు.
అయితే ధోని సిక్స్ కొట్టలేక పోవడానికి ఒకే ఒక్క కారణం అతడు మోకాలి గాయంతో బాధపడటం. అప్పటికే రెండు సిక్సర్లు బాది జట్టు విజయానికి తన శాయశక్తులా ప్రతయత్నించాడు. కానీ చివరి మూడు బంతులు సందీప్ శర్మ అద్భుతంగా బౌల్ చేయడం, మోకాలి నొప్పి బాధిస్తుండటంతో.. ధోని ఏమీ చేయలేకపోయాడు. ఇక హెలికాప్టర్ షాట్స్ కు పెట్టింది పేరు ధోని. కానీ ఈ మ్యాచ్ చివరి ఓవర్ లో ధోని అంత కంఫర్ట్ గా కనిపించలేదు. గత కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న ధోని.. ఆ బాధను దిగమింగుకుని మ్యాచ్ లు ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో అతడు వికెట్ల మధ్య పరిగెత్తిన తీరు చూస్తేనే అర్దం అవుతుంది.. ధోని ఎంతగా గాయంతో బాధపడుతున్నాడో అని.
ఇక ఇదే విషయం చెన్నై కోచ్ ప్లెమింగ్ సైతం వ్యక్తం చేశాడు. గత కొంత కాలంగా ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నాడు, అదే గాయంతోనే ఇప్పుడు మ్యాచ్ లు ఆడుతున్నాడని ప్లెమింగ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా దిగ్గజం మ్యాథ్యూ హెడెన్ సైతం తాజాగా మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ చేసిన విధానంపై స్పందించాడు. “ఈ మ్యాచ్ లో ధోని మునుపటి ధోనిలా కనిపించలేదు. గతంలో అతడు వికెట్ల మధ్య పరిగెడుతుంటే.. కరెంట్ పాస్ అయినట్లు అనిపించేది. కానీ ఇప్పుడు అది కనిపించడంలేదు” అంటూ హెడెన్ అన్నాడు. మరి ధోని లాస్ట్ బాల్ సిక్స్ కొట్టకపోవడానికి కారణం ఏంటో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.
Playing this type of innings at the age of 41 , huge respect to MS Dhoni 🙇 @ChennaiIPLpic.twitter.com/HG3EkUydda
— Jayprakash MSDian™ 🥳🦁 (@ms_dhoni_077) April 13, 2023
Matthew Hayden said, “there’s definitely something wrong with MS Dhoni. His running between the wickets is usually quite electric, which was not there Vs RR”.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 12, 2023