ఈసారి ఐపీఎల్ గమనిస్తే మీకు ఓ విషయం అర్థమవుతుంది. చెన్నై ప్రతి మ్యాచ్ లో ధోనీ చివర్లో వస్తున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు మహీ కౌంటర్ ఇచ్చేశాడు. ఇంతకీ ఏంటి సంగతి?
ఈసారి ఐపీఎల్ లో ధోనీ పేరు రీసౌండ్ లా వినిపిస్తోంది. క్రీజులో అతడు బ్యాటింగ్ చేస్తుంటే మ్యాజిక్ కనిపిస్తోంది. చెన్నై ఇప్పటివరకు 12 మ్యాచులాడితే.. కొన్నింట్లో మాత్రమే ధోనీకి బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా క్రీజులోకి వచ్చిన ప్రతిసారి ఒకటి రెండు సిక్సులే కొడుతున్నాడు. కిక్ మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ గా ఇస్తున్నాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కొందరు మాత్రం ధోనీ ఇలా లాస్ట్ లో వచ్చి క్రెడిట్ కొట్టేస్తుండటపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకు దీనిపై ఏం మాట్లాడని ధోనీ.. ఇప్పుడు ట్రోల్స్ కి కౌంటర్ ఇచ్చేశాడు. ఆ విషయం కాస్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ధోనీ పేరు చెప్పగానే అందరికీ అతడి కెప్టెన్సీ, ఐసీసీ ట్రోఫీలు గుర్తొస్తాయి. కానీ ధోనీలో మంచి రన్నర్ ఉన్నాడు. వికెట్ల మధ్య రన్ కోసం పరుగెత్తాడంటే అవతలి బ్యాటర్ ఊరకడానికి ప్రిపేర్ అయిపోవాలి. లేదంటే ధోనీ ఊరుకునేవాడు కాదు. ధోనీతో సమానంగా రన్నింగ్ అంటే కోహ్లీ మాత్రమే చేసేవాడు. 2020లో టీమిండియాకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. వయసు కూడా 40 దాటిపోయింది. కానీ ఫ్యాన్స్ అవేం పట్టవు కదా. ధోనీ నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో ధోనీ కాస్త ముందు రావాలి, చిరుతలా పరుగెత్తి రన్స్ తీయాలనుకుంటారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడిన ధోనీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ‘ఈ వయసులో బ్యాటింగ్ ఆర్డర్ లో ముందొచ్చి సింగిల్స్, డబుల్స్ తీయడం నా వల్ల కాదు. ఇన్నింగ్స్ చివర్లో వచ్చి సిక్సర్లు బాదడమే నేను చేయగలిగింది. వచ్చామా సిక్సులు కొట్టామా వెళ్లామా.. ఇదే నా జాబ్. నన్ను పరుగెత్తించకండి’ అని ధోనీ అన్నాడు. చివర్లో వస్తున్నాడు, ముందొస్తే బాగుండు లాంటివి మీరేమైనా ఆలోచించి ఉంటే.. ధోనీ చెప్పింది మరోసారి చదవండి. సో అదనమాట విషయం. మరి ధోనీ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
DO NOT MISS!
When @msdhoni cut loose! 💪 💪
Follow the match ▶️ https://t.co/soUtpXQjCX#TATAIPL | #CSKvDC | @ChennaiIPL pic.twitter.com/kduRZ94eEk
— IndianPremierLeague (@IPL) May 10, 2023