'రికార్డు క్రియేట్ చేయాలన్నా.. వాటిని తిరగరాయాలన్నా', 'వేరే ఎవరి వల్ల కాదు. అయ్యగారే నంబర్ వన్' అనే డైలాగ్స్ వినబడగానే క్రికెట్ ఫ్యాన్స్ కి గుర్తొచ్చే వన్ అండ్ ఓన్లీ పేరు ధోనీ. తాజాగా ఐపీఎల్ ఆడుతున్న ఇతడు.. ఎవరికీ సాధ్యం కానీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది. నా వరకైతే పసుపు జెర్సీలో చివరి ఓవర్ లో సిక్సులు బాదుతున్న సీనే గుర్తొస్తుంది. ఎందుకంటే టీమిండియాకు ఆడినన్ని రోజులు ఇతడిపై ఫ్యాన్స్ అంతులేని ప్రేమ చూపించారు. రిటైర్మెంట్ తర్వాత అంతకంటే ఎక్కువ లవ్ చూపిస్తున్నారు. 2020 సీజన్ నుంచీ ఐపీఎల్ ఎప్పుడొస్తుందా? ధోనీ బ్యాటింగ్ ఎప్పుడు చూస్తామా అన్నట్లు ఫ్యాన్స్ తెగ ఆత్రుతగా ఎదురుచూడటం మన చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ లో అది మరింత ఎక్కువైందనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఎవ్వరికీ సాధ్యం కానీ ఘనతల్ని ధోనీ క్రియేట్ చేస్తున్నాడు. తన స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు.
అసలు విషయానికొస్తే.. ధోనీ-చెన్నై సూపర్ కింగ్స్ ది నెవర్ ఎండింగ్ బాండింగ్. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఈ జట్టుకు కెప్టెన్ గా చేస్తున్న ధోనీ.. వేరే ఏ కెప్టెన్ కు సాధ్యం కానీ విధంగా రికార్డులు సృష్టిస్తున్నాడు. నాలుగుసార్లు కప్ గెలిపించిన ధోనీ.. చెన్నై టీమ్ ఏకంగా 11 సార్లు క్వాలిఫయర్స్ లో అడుగుపెట్టడంలో కెప్టెన్ గా కీ రోల్ ప్లే చేశాడు. ఫినిషర్ గా వచ్చినప్పటికీ.. ఐపీఎల్ లో 5000 పరుగుల మార్క్ ని అందుకున్నాడంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అలాంటి ధోనీ ఇప్పుడు ఎవరికీ సాధ్యం కాని మరో ఘనత సాధించాడు.
చెన్నై-రాజస్థాన్ మ్యాచ్ బుధవారం రాత్రి జరిగింది. చివరిబంతి వరకు ఎంతో థ్రిల్లింగ్ గా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోయింది. ఆ విషయం పక్కనబెడితే.. చివరి ఓవర్ లో ధోనీ బ్యాటింగ్ చేస్తుంటే.. జియో సినిమాస్ యాప్ లో వ్యూయర్ షిప్ రయ్ మని రాకెట్ లా దూసుకెళ్లింది. ఏకంగా 2.2 కోట్లమంది ఓన్లీ ఈ యాప్ లోనే చూశారు. ఈ లెక్కన చూసుకంటే టీవీ వ్యూయర్ షిప్ ఇంకెన్ని కోట్లు ఉందో? ఊహించుకుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పటివరకు చాలా మ్యాచ్ లు జరిగాయి కానీ ధోనీ బ్యాటింగ్ టైంలో 2 కోట్ల మార్క్ క్రాస్ అవడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. ఇదిలా ఉండగా రీసెంట్ గా ధోనీ, లక్నోతో ఆడినప్పుడు 1.7 కోట్లు, గుజరాత్ తో ఆడినప్పుడు 1.6 కోట్ల వ్యూయర్స్ మ్యాచ్ ని చూశారు. ఇలా ధోనీ బ్యాటింగ్.. కోట్లాది మంది వ్యూయర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. మరి ఈ విషయమై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
Highest viewership on JioCinema for IPL 2023:
CSK vs RR – 2.2 cr
RCB vs LSG – 1.8 cr
MI vs DC – 1.7 cr
CSK vs LSG – 1.7
CSK vs GT – 1.6 crThe brand of Dhoni. pic.twitter.com/GXizaEgewN
— Johns. (@CricCrazyJohns) April 12, 2023