ఐపీఎల్ లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదనుకున్న మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇది పక్కనబెడితే పంజాబ్ కెప్టెన్ ధావన్ చెత్త రికార్డు సృష్టించాడు. ఇంతకీ ఏంటి సంగతి?
ఐపీఎల్ లో తాజాగా దిల్లీ-పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ కైతే పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. దీంతో ఎవరూ పట్టించుకోలేదు. కానీ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ ఆయా జట్లు భారీ స్కోర్లు చేశాయి. ఫామ్ లో లేని వార్నర్, పృథ్వీషా అయితే రెచ్చిపోయి మరీ బ్యాటింగ్ చేయడం విశేషం. పంజాబ్ జట్టులోని లివింగ్ స్టన్ కూడా సెంచరీ చేస్తాడేమో అనిపించింది. అదే టైంలో సరికొత్త, చెత్త రికార్డులు నమోదు కావడం మరో విశేషం. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ దిల్లీ-పంజాబ్ మ్యాచ్ సంగతేంటి? ఇంతకీ ఏం జరిగింది?
అసలు విషయానికొచ్చేస్తే.. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ ఏకంగా 213/2 భారీ స్కోరు చేసింది. వార్నర్ 46, పృథ్వీ షా 54, రోసో 82, సాల్ట్ 26.. అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ఛేదనలో పంజాబ్ 198/8 స్కోరు చేసింది. లివింగ్ స్టోన్ 94 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అథర్వ తైడే 55 రన్స్ తో కాస్త సపోర్ట్ ఇచ్చాడు కానీ జట్టుని గెలిపించలేకపోయాడు. విచిత్రమేంటంటే ఈ మ్యాచ్ లో ఓడినా గెలిచినా దిల్లీకి ఏం ఉపయోగపడదు. అయినాసరే విజయం సాధించి, పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలని దెబ్బ కొట్టింది.
అసలే ఎవరు చూస్తారులే అనుకున్న మ్యాచ్ కాస్త ఇంత ఇంట్రెస్టింగ్ మారడం ఒకెత్తయితే.. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ చెత్త రికార్డు సృష్టించి హాట్ టాపిక్ గా మారిపోయాడు. గోల్డెన్ డకౌట్ అయిన ఇతడు.. ఐపీఎల్ లో ఓవరాల్ గా 10 సార్లు డకౌట్ అయిన రెండో ఓపెనర్ గా నిలిచాడు. టాప్ లో 11 డకౌట్స్ తో పార్థివ్ పటేల్ ఉన్నాడు. ధావన్ తోపాటు గంభీర్, రహానె పది డకౌట్స్ తో ఉన్నారు. వార్నర్ తొమ్మిదిసార్లు ఇలా ఔటయ్యాడు. సో అదనమాట విషయం. మరి ఈ మ్యాచ్, ధావన్ చెత్త రికార్డు నెలకొల్పడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.