Delhi Capitals: తొలి మ్యాచ్‌లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న పటిష్టమైన ఆర్సీబీని కేకేఆర్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ తెగ బాధపడిపోతుంది. ఎందుకంటే..
ఐపీఎల్ 2023లో ఒక మ్యాచ్‌ను మించి మరో మ్యాచ్ జరుగుతోంది. అంచనాలన్ని తలకిందులు అవుతున్నాయి. తొలి మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోతుంది. అది కూడా తొలి మ్యాచ్‌లో ఓడిన జట్టు చేతిలో.. ఇలా ఊహకు అందని విధంగా ఐపీఎల్ 2023 సాగుతోంది. గురువారం కోల్‌కత్తా నైట్‌రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్ అంచనాలకు మించి జరిగింది. 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన జట్టు 204 పరుగులు చేయడం క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. అందులోనూ.. విధ్వంసకర వీరుడు ఆండ్రూ రస్సెల్ డకౌట్ అయిన తర్వాత.. ఇలాంటి స్కోర్‌ను ఎవరూ ఆశించరు. కానీ అది సాధ్యమైంది. ఆల్‌రౌండర్ శార్ధుల్ ఠాకూర్ అలాంటి విధ్వంసం సృష్టించాడు.
కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని.. ఐపీఎల్ 2023లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదేశాడు. మొత్తం మీద 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 68 పరుగులు చేసి.. ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. శార్దుల్ చేసిన విధ్వంసంతో ఆర్సీబీ ఆత్మ విశ్వాసం కోల్పోయింది. అది వారి బ్యాటింగ్‌లో స్పష్టంగా కనిపించింది. కేకేఆర్ నిర్దేశించిన 205 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 17.4 ఓవర్లలోనే 123 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆరంభంలోనే దూకుడుగా ఆడినా.. వాళ్లు అవుటైన తర్వాత.. ఆర్సీబీ కోలుకోలేకపోయింది. కోహ్లీని సునీల్ నరైన్ తన స్పిన్ మాయాజాలంతో మరోసారి అవుట్ చేశాడు. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ సైతం కోహ్లీ తరహాలోనే స్పిన్‌కు బీటై.. మిస్టరీ స్పిన్నర్ వరణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అయ్యారు. పేపర్‌పై కేకేఆర్ కంటే బలమైన బ్యాటింగ్ లైనప్‌గా కనిపించిన ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్.. కోల్‌కత్తా స్పిన్ ముందు నిలువలేకపోయింది.
అయితే.. ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ హైలెట్‌గా నిలిచింది. 150 పరుగులు చేస్తే గొప్పే అని స్థాయి నుంచి 200 మార్క్ దాటించాడు. అక్కడే ఆర్సీబీ సగం మ్యాచ్‌ను ఓడిపోయింది. అయితే.. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం చూసి.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లు సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే.. ఈ సీజన్ కంటే ముందు శార్దుల్ ఠాకూర్ ఢిల్లీ టీమ్‌లోనే ఉండేవాడు. అయితే.. ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు ఇంటర్నల్ ట్రేడింగ్‌లో కేకేఆర్.. ఢిల్లీ నుంచి శార్దుల్‌ను తీసుకుంది. రూ.7 కోట్ల పైచిలుకు ధర చెల్లించి మరీ శార్ధుల్‌ను తీసుకుంది. కేకేఆర్ ఇచ్చిన ఆఫర్ నచ్చి.. అప్పుడు శార్దుల్‌ను వదులుకున్న ఢిల్లీ.. ఇప్పుడు అతని బ్యాటింగ్ చూసి.. అనవసరంగా వదులుకున్నామే అని తెగ బాధపడిపోతున్నట్లు సమాచారం. ఢిల్లీ మేనేజ్‌మెంట్ సైతం తమ నిర్ణయం సరికాదని పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shardul Thakur – joint fastest fifty in IPL 2023. pic.twitter.com/pvTlZ1Pug8
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2023