చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓడిపోయింది. ఈ ఓటమితో డీసీ ప్లేఆఫ్స్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. బుధవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 రన్స్ తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. సీఎస్కే నిర్దేశించిన 168 రన్స్ టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమై.. 140/8 రన్స్‌కే పరిమితమైంది. భారీ టార్గెట్ లేకపోయినా ఛేజింగ్‌లో ఢిల్లీ ఫెయిలైంది. తమ జట్టుకు ఉన్న బౌలింగ్ వనరులను చక్కగా ఉపయోగించుకుని ఢిల్లీని కట్టడి చేయడంలో సీఎస్కే సారథి ధోని కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో ఢిల్లీ జట్టు ఆఖరి స్థానానికి పడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు ముగిసిపోయాయనే చెప్పాలి. ఆ జట్టు తర్వాతి మూడు మ్యాచ్‌లు గెలిచినా ప్లేఆఫ్స్‌కు చేరడం కష్టమే. ఢిల్లీ ఓటములపై నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానమైన చెపాక్‌లో ఢిల్లీ గెలిచి చాలా ఏళ్లవుతోంది. ఇక్కడ చివరగా ఢిల్లీ గెలిచి దాదాపు 13 ఏళ్లు కావొస్తోంది.
ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టాప్ క్రికెటర్లుగా చెప్పుకునే కొందరు ఆటగాళ్లు.. ఢిల్లీ క్యాపిటల్స్ చెపాక్‌లో ఆఖరుగా గెలిచిన సమయానికి తమ కెరీర్‌ను అప్పుడప్పుడే మొదలుపెట్టారు. అప్పటికి స్టీవ్ స్మిత్ తన అంతర్జాతీయ కెరీర్లో కేవలం 16 రన్స్ మాత్రమే చేశాడు. విరాట్ కోహ్లీ కేవలం 2 సెంచరీలు మాత్రమే బాదాడు. జో రూట్, కేన్ విలియమ్సన్‌లు ఇంటర్నేషనల్ క్రికెట్లో అరంగేట్రం కూడా చేయలేదు. ఈ చెత్త రికార్డులను ఉదహరిస్తూ నెటిజన్స్ ఢిల్లీ జట్టును ట్రోల్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఢిల్లీ మళ్లీ చెపాక్‌లో గెలవలేదని విమర్శిస్తున్నారు. ఆయా క్రికెటర్లు అందరూ సూపర్ స్టార్లు అయిపోయారని.. కానీ ఢిల్లీ రాత మాత్రం మారలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్లో డీసీ జట్టు ఉండి వేస్ట్ అని, ఆ టీమ్‌ను తీసేయాలంటున్నారు. మరి.. నానాటికీ తీసికట్టుగా మారుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.