కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గాని మరి ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటేనే ఇబ్బంది. ఈ విషయంలో కాస్త నోరు జారిన వార్నర్ పరువు పోగొట్టుకున్నాడు. వార్నర్ సరదాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అతడి మీద ట్రోల్స్ కి కారణమవుతున్నాయి.
ఐపీఎల్ లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో సూపర్ కింగ్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచులో భారీ విజయంతో ప్లే ఆఫ్ బెర్త్ తో పాటుగా టాప్ 2 స్థానాన్ని దాదాపుగా ఖరారు చేసుకుంది. దీంతో 12 సార్లు ప్లే అఫ్ కి వెళ్లిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ లో చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉండగా..ఈ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అత్యుత్సాహానికి పోయి పరువు పోగొట్టుకున్నాడు.
ఐపీఎల్ లో మరో జట్టు ప్లే ఆఫ్ కంఫర్మ్ అయిపోయింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్ కి అర్హత సాధించగా.. తాజాగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ మీద చెన్నై విజయ సాధించి ఈ సీజన్ లో ప్లే ఆఫ్ కి వెళ్లిన రెండో జట్టుగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ కి ముందు వార్నర్ కాస్త సరదాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అతడి మీద ట్రోల్స్ కి కారణమవుతున్నాయి. ఈ మ్యాచ్ కి ముందు వార్నర్ ఈ రోజు చెన్నై పార్టీని నాశనం చేస్తున్నాం అనే వ్యాఖ్యలు చేసాడు. మ్యాచ్ అనంతరం ఢిల్లీ ఘోర పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. వార్నర్ కి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గాని మరి ఇంతలా ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు అని చెప్పుకొస్తున్నారు,. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచులో ఢిల్లీ ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఓపెనర్లు ఋతురాజ్ గైక్వాడ్(79) కాన్వే(87) తొలి వికెట్ కి ఏకంగా 141 పరుగుల భాగస్వామ్యం ఇచ్చారు. ఇక ఆ తర్వాత వచ్చిన దూబే సిక్సర్ల వర్షం కురిపించగా.. చివర్లో జడేజా మెరుపు ఇనింగ్స్ ఆడాడు. ఇక భారీ లక్ష్య ఛేదనలో వార్నర్(86) మినహా ఎవరూ కూడా కనీస ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో ఢిల్లీ స్కోర్ 146 పరుగులకే పరిమితమైంది. మొత్తానికి వార్నర్ చెన్నై టీం మీద సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇలా ట్రోల్స్ కి గురి కావడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.