క్రికెటర్లకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. వారిని చాలా మంది ఆరాధిస్తుంటారు, స్ఫూర్తిగా కూడా తీసుకుంటారు. అలాంటి ప్లేయర్లు తప్పులు చేస్తే, హద్దులు మీరి ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? అది వ్యక్తిగత ఇమేజ్ను పాడు చేయడంతో పాటు ఆట ప్రతిష్టను కూడా దిగజారుస్తుంది.
క్రికెటర్లు అంటే ప్రేక్షకుల్లో ఎంత ఆదరాభిమానాలు, గౌరవం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ ఆటతీరు, పోరాట పటిమతో అందరికీ స్ఫూర్తిగా నిలవాల్సిన ఆటగాళ్లు తప్పు చేస్తే ఎలా ఉంటుంది? మైదానం లోపల, బయట హుందాగా ప్రవర్తిస్తూ గేమ్ గౌరవాన్ని పెంచాల్సిన వాళ్లే అసభ్యంగా ప్రవర్తిస్తే అది వారి వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు ఆటకు కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. తాజాగా అలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ ఒకరు తప్పతాగి ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని సమాచారం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో నెగ్గిన తర్వాత ఢిల్లీ ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన పార్టీలో ఈ ఘటన చోటుచేసకుందని తెలుస్తోంది.
ఆ పార్టీలో ఒక స్టార్ డీసీ ప్లేయర్.. అక్కడికి వచ్చిన ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడని జట్టు వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ.. ఆటగాళ్లకు కొన్ని కఠిన నిబంధనలు పెట్టినట్లు సమాచారం. ఫ్రాంచైజీ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు ఈ రూల్స్‌ను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రి 10 గంటల తర్వాత బయటి వ్యక్తులు ఎవరూ కూడా ప్లేయర్ల గదుల్లోకి వెళ్లడానికి వీల్లేదని ఫ్రాంచైజీ స్పష్టం చేసిందట. ఒకవేళ ఎవరైనా ఆటగాళ్లను కలవాలనుకుంటే ఫొటో ఐడెంటిఫికేషన్ ఇవ్వడంతో పాటు ఐపీఎల్ టీమ్ ఇంటెగ్రిటీ ఆఫీసర్ నుంచి అనుమతి తీసుకోవాలి.
ఎప్పుడైనా బయటకు వెళ్లాలంటే ప్రతి ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు తమ ఫ్రాంచైజీ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలట. ప్లేయర్ల భార్యలు, ప్రియురాళ్లకు హోటల్లోకి అనుమతి ఉన్నా.. వారి ఖర్చులను ఆటగాళ్లే భరించాల్సి ఉంటుందట. ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన అన్ని కార్యక్రమాలకు ప్లేయర్లు కచ్చితంగా హాజరవ్వాలి. ఈ రూల్స్‌ను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని.. తప్పును బట్టి చర్యలు ఉంటాయని తెలుస్తోంది. తప్పు పెద్దదైతే కాంట్రాక్ట్‌ను కూడా రద్దు చేస్తారని నేషనల్ మీడియా సమాచారం. ఇకపోతే, ఈ సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైంది ఢిల్లీ క్యాపిటల్స్. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయితే ఆ తర్వాత తేరుకుంది. వరుసగా రెండు విజయాలతో దూసుకెళ్తోంది. సారథి డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌లో రాణిస్తుండగా.. బౌలింగ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తన సత్తా చాటుతుండటం డీసీకి కలిసొచ్చే అంశం.
A DC cricketer reportedly misbehaved with a woman at a party#IPL2023 #DelhiCapitals
(via @HTSportsNews)https://t.co/qzakjVmalH— Hindustan Times (@htTweets) April 27, 2023