క్రికెట్ లో ఏ రికార్డ్ కి గ్యారంటీ లేదు. ఎప్పుడో ఒకసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే. కానీ ఒక రికార్డ్ మాత్రం 15 ఏళ్ళ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ చెక్కు చెదరలేదు. నిన్న జరిగిన మ్యాచులో ఆ రికార్డుకి రాజస్థాన్ చేరువగా వచ్చినా.. తృటిలో చేజారింది.
ఐపీఎల్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచులో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై రాజస్థాన్ రాయల్స్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 150 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించి సంచలన విజయం సాధించింది. జైస్వాల్ (98), సంజు శాంసన్ (48) దూకుడుతో మరో 41 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన రాజస్థాన్ ఒక రికార్డుని తృటిలో కోల్పోయింది. డెక్కన్ ఛార్జర్స్ నెలకొల్పిన ఈ రికార్డుకి చేరువగా వచ్చినా.. దానిని అందుకోవడంలో విఫలమైంది. మరి ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం డెక్కన్ చార్జర్స్ నెలకొల్పిన ఈ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈడెన్ గార్డెన్స్ లో నిన్న కేకేఆర్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో కేకేఆర్ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ముందుగా బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ విభాగంలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా బ్యాటింగ్ లో రాజస్థాన్ ఇన్నింగ్స్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ క్రమంలో వ్యక్తిగతంగా, జట్టుగా ఎన్నో రికార్డులు సృష్టించిన రాజస్థాన్ 2008 లో డెక్కన్ చార్జర్స్ ఛేజింగ్ లో నెలకొల్పిన ఒక రికార్డ్ బ్రేక్ చేయలేకపోయింది. 2008 లో ముంబై ఇండియన్స్ పై మన హైదరాబాద్ టీం 150 కి పరుగుల లక్ష్యాన్ని 12 ఓవర్లలోనే కొట్టేశారు. ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ గిల్ క్రిస్ట్ 42 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు.
ఒక టీం 150 లేదా అంతకన్నా.. ఎక్కువ లక్ష్యాన్ని ఎక్కువ బంతులు మిగిలించి కొట్టిన రికార్డ్ ఇప్పటివరకు డెక్కన్ చార్జర్స్ మీదే ఉంది. 2008 లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసి 154 పరుగులు చేయగా.. డెక్కన్ చార్జర్స్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆ లక్ష్యాన్ని 12 ఓవర్లలోనే కొట్టేసింది. తాజాగా రాజస్థాన్ 150 పరుగుల 41 బంతులు మిగిలించి చేధించడంతో ఈ రికార్డ్ ఇంకా అలాగే ఉండడం విశేషం. మరి 15 ఏళ్ళైనా డెక్కన్ ఛార్జర్స్ రికార్డ్ అలాగే ఉండడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.