గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అది కూడా తొలి ఓవర్ తొలి బంతికే కావడం విశేషం. షమీ వేసిన ఈ ఓవర్ లో తొలి బంతి వైడ్ కాగా.. తర్వాత బంతికి వార్నర్ బౌల్డ్ అయ్యాడు. కానీ అంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు.
సాధారణంగా క్రికెట్ లో అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఒక్కోసారి వాటిని చూస్తే గాని నమ్మలేం. కొన్ని సార్లు చూసినా నమ్మలేం. అలాంటి నమ్మలేని సంఘటనే తాజాగా జరుగుతున్న ఐపీఎల్ లో నమోదు అయ్యింది. మంగళవారం(మార్చి 4) గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అది కూడా తొలి ఓవర్ తొలి బంతికే కావడం విశేషం. షమీ వేసిన ఈ ఓవర్ లో తొలి బంతి వైడ్ కాగా.. తర్వాత బంతికి వార్నర్ బౌల్డ్ అయ్యాడు. కానీ అంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. బాల్ క్లియర్ గా వికెట్లను తాకినట్లు రిప్లేలో సైతం కనిపించింది. మరి అంపైర్ ఎందుకు అవుట్ ఇవ్వలేదో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL 2023లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగింది ఢిల్లీ జట్టు. ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్-పృథ్వీ షాలు బరిలోకి దిగారు. ఇక తొలి ఓవర్ లో ఆసక్తికర, అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. షమీ తొలి ఓవర్ తొలి బంతిని వైడ్ గా వేశాడు. ఆ తర్వాత ఓ అద్భుతమైన బంతిని విసిరాడు షమీ. మంచి లైన్ అండ్ లెంగ్త్ లో పడ్డ ఆ బాల్ ను ఆడటంలో విఫలం అయ్యాడు వార్నర్. దాంతో ఆ బాల్ సరాసరి ఆఫ్ స్టంప్ వికెట్ కు తాకింది. అయితే ఆ బాల్ వికెట్ తికినట్లు రిప్లేలో చూస్తే గానీ తెలియలేదు. ఎందుకంటే వికెట్ కు బాల్ తాకినా గానీ బెయిల్స్ వెలగలేదు, కిందపడలేదు.
ఇక క్రికెట్ నిబంధనల ప్రకారం బెయిల్స్ కింద పడితే అవుట్ ఇస్తారు. ఇక్కడ బెయిల్స్ పడలేదు కాబట్టి వార్నర్ బతికిపోయాడు. ఈ దృశ్యం చూసిన వారందరు ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్ బౌలర్ షమీ ఢిల్లీ క్యాపిటల్స్ ను ఆదిలోనే దెబ్బకొట్టాడు. తన రెండో ఓవర్లోనే డాషింగ్ బ్యాటర్ పృథ్వీ షా (7)ను అవుట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన మిచెల్ మార్ష్(4)ను బౌల్డ్ చేశాడు. లైఫ్ లభించిన వార్నర్(37) పరుగులు చేసి అల్జారీ జోసెప్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన రూసో సైతం జోసెప్ బౌలింగ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ 9 ఓవర్లకు 70/4 స్కోరుతో ఉంది.
Lucky escape for David Warner.
📸: Jio Cinema pic.twitter.com/lCbxOQ0Zes
— CricTracker (@Cricketracker) April 4, 2023