ఢిల్లీ-గుజరాత్ మధ్య జరిగిన మ్యాచులో పెను ప్రమాదం తప్పింది. గుజరాత్ బౌలర్ వేసిన ఓ రాకాసి బౌన్సర్ యువ క్రికెటర్ హెల్మెట్ కు బలంగా తాకింది.
రాకాసి బౌన్సర్లు ఎంత ప్రమాదమో అందరకీ విదితమే. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే ఈ డెడ్లీ బౌన్సర్స్ ఆటగాళ్లను తీవ్రంగా గాయపరచడమే కాదు.. ఒక్కోసారి వారి ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూజెస్ అలా ప్రాణాలు పోగొట్టుకున్నవాడే. మరో ఆస్ట్రేలియా ఆటగాడైన సీన్ అబాట్ వేసిన ఓ రాకాసి బౌన్సర్ అతని ప్రాణాలు బలిగొంది. తాజాగా, ఐపీఎల్ 2023 భాగంగా ఢిల్లీ- గుజరాత్ మ్యాచులో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అల్జారీ జోసెఫ్ వేసిన ఓ బంతి అభిషేక్ పోరెల్ బలంగా తాకింది. కాకుంటే ఈ ఘటనలో ఎలాంటి చేదు ఘటన జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ బ్యాటర్లు దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించారు. పృథ్వీ షా(7) విఫలమైనా మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(37),ఎడా పెడా బౌండరీలు బాదుతూ గుజరాత్ బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం వారిని దెబ్బతీసింది. మిచెల్ మార్ష్ (4) పరుగులకే వెనుదిరగగా, రిలీరోసో (0) డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అభిషేక్ పోరెల్(20; 11 బంతుల్లో 2 సిక్సులు) విలువైన పరుగులు చేశాడు. అయితే అల్జారీ జోసెఫ్ వేసిన రాకాసి బౌన్సర్ అతని ఏకకాగ్రతను దెబ్బతీసింది. భారీ షాట్ కు ప్రయత్నించిన పోరెల్ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. కాగా, బెంగాల్ వికెట్ కీపర్ అయిన అభిషేక్ పొరెల్ కి ఇది తొలి ఐపీఎల్ మ్యాచ్. రిషభ్ పంత్ గాయం బారిన పడి సీజన్ మొత్తానికి దూరం కావడంతో ఢిల్లీ యాజమాన్యం ఈ యంగ్‌స్టర్‌ను ఎంపిక చేసింది.
— WPL MAHARASTRA (@WMaharastra) April 4, 2023
Abishek Porel is handed his cap and is going to make his debut for the Capitals. #IPL #TATAIPL2023 #CricketTwitterpic.twitter.com/VbDUFo8HEP
— Indian Domestic Cricket Forum – IDCF (@IDCForum) April 4, 2023