ఐపీఎల్ 16వ సీజన్ కు ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వార్నర్.. అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు అర్ధశతకాలతో అదరగొట్టాడు. అయితే వార్నర్ ఆడిన ఈ ఇన్నింగ్స్ లన్ని స్లో బ్యాటింగ్ చేసినవే కావడం గమనార్హం. దాంతో వార్నర్ స్లో బ్యాటింగ్ వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మాస్టర్ ప్లాన్ తెలిస్తే దిమ్మతిరిగిపోవడం ఖాయం. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ అంటేనే అందరికి గుర్తుకు వచ్చేది ధనాధన్ బ్యాటింగ్, భారీ సిక్సర్లు, ఫోర్లు. ఇక కొంత మంది ఆటగాళ్ల బ్యాటింగ్ చూస్తే.. ఐపీఎల్ కోసమే కొంత మంది పుట్టారు అనిపిస్తుంది. క్రిస్ గేల్, పొలార్డ్, రస్సెల్, వార్నర్, రాహుల్, రైనా, విరాట్ కోహ్లీ ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎంతో మంది ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. ఇక వీరందరిలో ఆసిస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ది ప్రత్యేక శైలి అనే చెప్పాలి. ఐపీఎల్ లో తనకంటూ ఓ గుర్తింపును, ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు ఈ డాషింగ్ బ్యాటర్. ఐపీఎల్ లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్ గా పేరుగడించాడు వార్నర్. ఇక ఐపీఎల్ 16వ సీజన్ కు ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వార్నర్.. అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు అర్ధశతకాలతో అదరగొట్టాడు. అయితే ఆ ఇన్నింగ్స్ లు ఏవీ జట్టును గెలిపించలేకపోయాయి. వార్నర్ ఆడిన ఈ ఇన్నింగ్స్ లన్ని స్లో బ్యాటింగ్ చేసినవే కావడం గమనార్హం. దాంతో వార్నర్ స్లో బ్యాటింగ్ వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మాస్టర్ ప్లాన్ తెలిస్తే దిమ్మతిరిగిపోవడం ఖాయం. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డేవిడ్ వార్నర్.. సమకాలీన క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్ కు తగ్గట్లుగా ఆడటంలో.. వార్నర్ సిద్దహస్తుడు. ఇక ఐపీఎల్ లో వార్నర్ కు తిరుగులేని రికార్డు ఉందన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 16వ సీజన్ లో వార్నర్ స్లో బ్యాటింగ్ తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వార్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయి, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. అయితే ఈ నాలుగు మ్యాచ్ ల్లో వార్నర్ మూడు అర్ధశతకాలు సాధించడం గమనార్హం. ఇక్కడ ఓ విషయం గమనించాల్సిన అవసరం ఉంది. వార్నర్ కంటిన్యూస్ గా పరుగులు అయితే చేస్తున్నాడు కానీ.. అవి టీ20 ఫార్మాట్ లో కాదు. అవును టీ20 ఫార్మాట్ ను వన్డే ఫార్మాట్ లా ఆడుతున్నాడు వార్నర్.
ఇక ఈ విషయం గత నాలుగు మ్యాచ్ ల గణాంకాలు చూస్తే.. తెలిసిపోతుంది. లక్నోతో జరిగిన మ్యాచ్ లో 48 బంతుల్లో 56 పరుగులు, గుజరాత్ తో మ్యాచ్ లో 32 బంతుల్లో 37 రన్స్, రాజస్థాన్ మ్యాచ్ లో 55 బంతుల్లో 65 పరుగులు ఇక తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ రన్స్ చూస్తుంటే వార్నర్ బాగానే ఆడుతున్నాడుగా అని అనిపించవచ్చు. కానీ ఇది టీ20 మ్యాచ్ అని ఇక్కడ మనం గుర్తించుకోవాలి. ఐపీఎల్ లో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేస్తేనే.. జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి స్లో ఇన్నింగ్స్ ల వల్ల విజయాల కంటే ఓటములకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే వార్నర్ ఈ స్లో ఇన్నింగ్స్ ల వెనక ఓ భారీ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మాస్టర్ ప్లాన్ తెలిస్తే మనకు దిమ్మతిరిగిపోద్ది. వార్నర్ ప్లాన్ ఏంటి అంటే? ఈ ఏడాది వరల్డ్ కప్ 2023కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇక్కడి పిచ్ లపై ఇప్పటికే వార్నర్ కు ఆడిన అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని మరింతగా ఉపయోగించుకుంటూ.. వచ్చే వరల్డ్ కప్ కు సిద్దం అవుతున్నాడు డేవిడ్ భాయ్. దీనికి సాక్ష్యాలు అతడు ఆడిన నాలుగు ఇన్నింగ్స్ లు వన్డే స్టైల్లో బాల్ టూ బాల్ ఆడినవే కావడం గమనార్హం. వన్డే వరల్డ్ కప్ కు వార్నర్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మో వార్నర్ పెద్ద ప్లానే వేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. అయితే మరికొంత మంది మాత్రం వేరే విధంగా చెప్పుకొస్తున్నారు. వార్నర్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో అవతలి ఎండ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ ల నుంచి సహకారం లభించడం లేదు. దాంతో తాను కూడా స్పీడ్ గా ఆడి.. అవుట్ అయితే జట్టు మరింతగా దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతోనే.. వార్నర్ అలా ఆడుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి వార్నర్ స్లో బ్యాటింగ్ కు రీజన్ వరల్డ్ కప్ 2023 అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.